Main Menu

2వేల నోట్ల రద్దుపై ఆర్థికమంత్రి అనూహ్య సమాధానం

Spread the love

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేస్తుందని వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. అవన్నీ వదంతులేనని ఆయన కొట్టిపారేశారు. గుజరాత్‌ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేస్తున్నారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.

”అవన్నీ వూహాగానాలే. రెండు వేల నోట్ల ముద్రణను నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులే. ఇటువంటి వాటిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వాటిని నమ్మొద్దు” అని జైట్లీ స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్టు… ఆర్‌బీఐ రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోబోతుందని లేదా పెద్ద డినామినేషన్‌ కరెన్సీ ప్రింటింగ్‌ను ఆపివేస్తుందంటూ వెల్లడించింది. పెద్ద నోట్లను మార్కెట్‌లోకి విడుదల చేయడాన్ని తగ్గించి, చిన్న నోట్ల సర్క్యూలేషన్‌పైనే ఎక్కువగా దృష్టిసారించినట్టు రీసెర్చ్‌ రిపోర్టు పేర్కొంది.






Related News

మీ కార్డులు మార్చుకోవాల్సిందే..!!

Spread the love1Shareఆర్బీఐ కొత్త నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. వ‌చ్చే క్యాలెండ‌ర్ ఇయ‌ర్ నుంచి ప్రారంభించ‌బోతోంది. డెబిట్, క్రెడిట్ కార్డుల విష‌యంలోRead More

పాతాళానికి ప‌త‌నం దిశ‌లో రూపాయి..

Spread the loveఇండియ‌న్ రూపాయి ప‌త‌నం పాతాళానికి ప‌డిపోతున్న‌ట్టుగా ఉంది. రూపాయి విలువ రోజురోజుకు రికార్డు స్థాయిలో పతనమతున్న తీరుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *