భారతీయుల కోసం అమెజాన్’బ్లాక్ ఫ్రైడే సేల్’

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన భారతీయ కస్టమర్ల కోసం ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ ప్రకటించింది. కంపెనీ గ్లోబల్ స్టోర్‌లో ఈ సేల్‌ను నిర్వహించనుంది. రేపు(నవంబర్ 24) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ ప్రారంభమవుతోంది. ఈ సేల్ కేవలం తన గ్లోబల్ స్టోర్పైనే వాలిడ్‌లో ఉండనుంది. అమెజాన్ ఇండియా వెబ్సైట్లో ఇది వర్తించదు. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా తన యాప్‌పై ఈ-టైలర్ క్విజ్ పోటీ నిర్వహిస్తుంది. ఈ బ్లాక్ ఫ్రైడే క్విజ్‌లో ఆరు తేలికైన ప్రశ్నలను అడుగుతుంది. ఆరింటికి సరియైన జవాబులు చెప్పిన వారు, లక్కీ డ్రాలోకి ఎంట్రీ ఉంటుంది. ఈ లక్కీ డ్రాలో 10వేల రూపాయలను గెలుపొందే అవకాశముంటుంది. అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా ఈ మొత్తాన్ని అందిస్తుంది.
తర్వాత ఈ మొత్తాన్ని అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవడానికి వాడుకోవాల్సి ఉంటుంది. మొత్తం 20 మంది లక్కీ విన్నర్లకు ఈ బహుమతిని అందిస్తుంది. అమెజాన్ గ్లోబల్ స్టోర్‌లో ఎలక్ట్రానిక్స్, యాక్ససరీస్, హోమ్, ఫ్యాషన్, గేమ్స్, స్పోర్ట్స్, అవుట్డోర్ ప్రొడక్ట్‌లు వంటి వివిధ కేటగిరీ వస్తువులను ఆఫర్ చేస్తుంది. అమెజాన్ స్టోర్‌లో లిస్టు అయ్యే ఉత్పత్తుల ధరల్లో దిగుమతి డ్యూటీలు కూడా ఉంటాయి. గ్లోబల్ స్టోర్ నుంచి ఆఫర్ చేసే ఉత్పత్తుల ధరలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉంటాయని తెలిసింది. అంతర్జాతీయ బ్రాండులపై 40 శాతం వరకు తగ్గింపును అందించనున్నట్టు ఈ-టైలర్ పేర్కొంటోంది. అన్ని లిస్టెడ్ కేటగిరీ ఉత్పత్తులను బ్లాక్ ఫ్రైడే సేల్‌లో యూజర్లు కొనుగోలు చేసుకోవచ్చు.
Related News

రికార్డ్ రేటులో బంగారం
Spread the loveదేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర రూ. 320 పెరిగి,Read More

జీ కోసం కన్నేసిన జియో
Spread the loveఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌పై టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కన్నేసింది. చౌక చార్జీలతోRead More