ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌..

Airtel-4G
Spread the love

రిలయన్స్‌ జియోకు గట్టిపోటీని ఇచ్చేందుకు టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ తన కస్టమర్లకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. పోస్టుపెయిడ్‌ కస్టమర్లు ఒకవేళ నెలలో వాడుకోవాల్సిన డేటాను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతే దాన్ని వచ్చే బిల్లింగ్‌ సైకిల్‌లో వాడుకునేలా అవకాశం కల్పించింది. అంటే డేటా క్యారీ ఫార్వర్డ్‌ ద్వారా దీన్ని వచ్చే బిల్లింగ్‌ సైకిల్‌కు మార్చుకోవచ్చు. దీంతో డేటా సమయం అయిపోతుందనే బెంగ యూజర్లకు ఉండదు. ఆగస్టు 1 నుంచి ఈ డేటా క్యారీ ఫార్వర్డ్‌ సేవలను కంపెనీ ప్రారంభించనున్నట్టు ఎయిర్‌టెల్‌ చెప్పింది. మైఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా డేటాను ట్రాక్‌ చేసుకుని, వచ్చే బిల్లింగ్‌ సైకిల్‌కు ఫార్వర్డ్‌ చేసుకోవచ్చు. కస్టమర్లు తమ అకౌంట్‌పైన పలు పోస్టుపోయిడ్‌ కనెక్షన్లను తీసుకుని కూడా 20 శాతం వరకు ఖర్చును ఆదా చేసుకోవచ్చు. ఇలా అన్ని కనెక్షన్లకు డేటా ప్రయోజనాలను షేర్‌ చేసుకోవచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

రిలయన్స్‌ జియో మార్కెట్లోకి ప్రవేశించిన దగ్గర్నుంచి ఈ కంపెనీకి తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. తన కస్టమర్లను కాపాడుకోవడానికి ఎయిర్‌టెల్‌ పలు ఆఫర్లను సైతం ప్రవేశపెడుతోంది. జియో దెబ్బకు ఈ కంపెనీకి నష్టాలు సైతం వాటిల్లుతున్నాయి. కానీ జియోకు గట్టికి బదులు ఇచ్చేందుకు ఎయిర్‌టెల్‌ సిద్ధమైంది. ప్రాజెక్ట్‌ నెక్ట్స్‌లో భాగంగా ఎయిర్‌టెల్‌ తన ఇన్‌-స్టోర్‌ అనుభవాన్ని మెరుగుపరుచుకోనుంది. దేశమంతటా ఉన్న 2500కి పైగా స్టోర్లను రీడిజైన్‌ చేయనుంది. అంతేకాక ప్లాన్లను మార్చుకోవడానికి కస్టమర్లకు మైఎయిర్‌టెల్‌యాప్‌ కొత్తవెర్షన్‌ను ఆవిష్కరించింది.






Related News

gold

పడిపోయిన బంగారం ధరలు

Spread the loveఅంతర్జాతీయ మార్కెట్ పరిణామాలతో దేశీయంగా ఓవైపు సెన్సెక్స్ పతనం అవుతోంది. బడ్జెట్ తర్వాత రోజురోజుకీ దిగువకు పడిపోతుంది.Read More

MODI

మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు

Spread the loveఈ ఏడాది మార్చితో ముగిసే 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతానికే పరిమితం కానున్నట్టుRead More

  • పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…
  • వోడాఫోన్ బంపరాఫర్
  • 2వేల నోట్ల రద్దుపై ఆర్థికమంత్రి అనూహ్య సమాధానం
  • సంచలనం: మళ్లీ నోట్ల రద్దు
  • క్రెడిట్ కార్డ్ వాడకంలో జాగ్రత్తలు
  • లక్షమందికి ఐటీ నోటీసులు జారీ ..
  • భారతీయుల కోసం అమెజాన్‌’బ్లాక్‌ ఫ్రైడే సేల్‌’
  • భారీగా పెరిగిన బంగారం ధరలు
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *