ఎయిర్ టెల్ న‌యా ధ‌మాకా

Airtel-4G
Spread the love

రిలయన్స్‌ జియోకు గట్టి పోటినిచ్చేందుకు భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. రిలియన్స్‌ జియో తన వినియోగదారు విస్తృతిని మరింతగా పెంచుకునే క్రమంలో గత జులైలో రూ.1500లకే 4జి ఆధారిత మేటి ఫీచర్‌ఫోన్‌ను అందించనున్నట్టుగా ప్రకటించింది. బుకింగ్‌ ప్రక్రియను పూర్తిచేసుకొని డెలివరీ సన్నాహాలను ప్రారంభించింది. వచ్చే దసరా నవరాత్రుల నుంచి ఈ ఫోన్‌లను వినియోగదారులకు అందించనున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోటీ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ సమాయత్తమైంది.

ఇందులో భాగంగా వచ్చే దీపావళి నాటికి రూ.2500లకే 4జి ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నట్టుగా సమాచారం. ఫీచర్ల ను బట్టీ వీటి ధరను రూ.2,500-2,700 వరకు నిర్ణయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. జియోకు పోటీగా 4జి ఫోన్లను అందుబాటులో తెచ్చేందుకు గాను ఎయిర్‌టెల్‌ సంస్థ ఫోన్ల తయారీ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఆకర్షణీయమైన పథకంతో ఈ 4జి ఫోన్‌ను తాము అందుబాటులోకి తేనున్నట్టుగా సంస్థ అధికారి ఒకరు తెలిపారు. వీవోఎల్‌టీఈ ఆధారిత 4జి స్మార్ట్‌ఫోన్‌ను యాండ్రాయిడ్‌ వోఎస్‌, 1జిబి రామ్‌. ఎయిర్‌టెల్‌ డ్యూయెల్‌ సిమ్‌లు, రెండు వైపుల కెమేరాతో పాటు దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీతో అందుబాటులోకి తేనుంది.


Related News

forbes-759

ఫోర్బ్ లిస్టులో ముగ్గురు దిగ్గజ భారతీయులు

Spread the loveదిగ్గజ భారతీయ వ్యాపార వేత్తలకు ఫోర్బ్స్‌ మేగజైన్‌ మరో కితాబునిచ్చింది. ఫోర్బ్స్‌ మేగజైన్‌ తాజాగా హండ్రెడ్‌ గ్రేటెస్ట్‌Read More

Paytm-Mall-Bazaar-Online-Alibaba

పేటీఎం మాల్ మెగాసేల్

Spread the loveఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు పోటీగా పేటీఎం మాల్‌ కూడా మెగా సేల్‌ ఈవెంట్‌ను ప్రకటించింది. మెరాRead More

 • ఎయిర్ టెల్ న‌యా ధ‌మాకా
 • అమాంతంగా పెరిగిన బంగారం ధర
 • జియోకి ఎయిర్ టెల్ కౌంటర్ ప్లాన్
 • నోట్లరద్దుతో డిజిటల్ ప్రయోజనం కూడా లేదు
 • మార్కెట్లో 200..
 • 60వేలకే కారు..అస‌లొస్తుందా?
 • బంగారం భారీగా పెరిగింది..!
 • హెరిటేజ్ లాభాల్లో క్షీణ‌త‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *