మూడేళ్లలో 5జీ

5g service
Spread the love

మరో మూడేళ్ల కాలంలో 5-జి సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఏకంగా 500 కోట్ల రూపాయలతో ఓ నిధిని ఏర్పాటుచేయాలని కూడా సంకల్పిస్తోంది. 5జి సేవలు అందుబాటులోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో పదివేల ఎంబిపిస్ వేగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి ఎంబిపిఎస్ వేగంతో ప్రసారాలను సాగించే అవకాశం ఉంటుందని కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు.

5జి సేవలను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చే విధంగా పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం 500 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటుచేస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఉన్నత స్థాయిలో 5జి ఫోరాన్ని నెలకొల్పామని, ఈ ఫోరం లక్ష్యాన్ని సాధించే దిశగా తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుందని తెలిపారు. 2020 నాటికల్లా దేశంలో 5జి వైర్‌లెస్ ప్రసార సేవలను అందుబాటులోకి తేవాలన్నదే తమ ప్రయత్నాల లక్ష్యమని ఆయన వెల్లడించారు. 2020 నాటికి ప్రపంచ దేశాలన్నీ 5జి సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో భారత్ ఎంతమాత్రం వెనకబడి ఉండటానికి వీల్లేదని ఆయన ఉద్ఘాటించారు. ‘5జి ఇండియా 2020 ఫోరమ్’ ఏర్పాటును ఈ సందర్భంగా ప్రకటించిన ఆయన టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ సారథ్యంలోఇది పనిచేస్తుందని ఐటి కార్యదర్శి అజయ్‌కుమార్, శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి అశుతోష్ శర్మ ఇందులో సభ్యులుగా ఉంటారని, అలాగే టెక్నాలజీ రంగానికి చెందిన పలువురు నిపుణులను కూడా సభ్యులుగా చేర్చుకుంటామన్నారు. 3జి, 4జి టెక్నాలజీల రంగంలో పట్టు సాధించే అవకాశాన్ని భారత్ గతంలో కోల్పోయిందని, ఇప్పుడు ప్రామాణికత విషయంలోనూ, ఉత్పాదకత విషయంలోనూ ఏమాత్రం వెనకబడని రీతిలో 5జి సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో పనిచేస్తోందని సిన్హా వెల్లడించారు. ప్రపంచ పోటీని తట్టుకునే రీతిలో నాణ్యతాయుతమైన ఉత్పత్తులను తీసుకొస్తామని 50 శాతం భారత మార్కెట్ పదిశాతం అంతర్జాతీయ మార్కెట్ పట్టును సాధించే దిశగానే చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు.

రానున్న ఐదునుంచి ఏడేళ్ల కాలంలో ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా మార్గనిర్దేశనం చేసుకుంటున్నామన్నారు. 4జి టెక్నాలజీ కంటే కూడా ఎంతో వేగంగా వైర్‌లెస్ సేవలు అందించడమన్నది ఈ కొత్త సర్వీసు వల్ల సాధ్యమవుతుందని, ముఖ్యంగా వైద్య స్వయం చోదిత కార్లు తదితర రంగాల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వెల్లడించారు. అంటే వీటిని నియంత్రించడానికి, నిర్వహించడానికి కూడా ఈ 5జి సర్వీసులు విస్తృతంగా తోడ్పడతాయన్నారు. కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చే విషయంలో భారతదేశం శరవేగంగా ముందుకు వెళ్లాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన ఉద్ఘాటించారు. గతంలో ఎవరికి వారుగానే ఈ తరహా ప్రయత్నాలు జరిగేవని, కానీ తమ ప్రభుత్వం సమష్టి ప్రయత్నంగానే ఈ టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న పట్టుదలతో పనిచేస్తోందన్నారు.


Related News

mobile ivomi 5

ఇండియాకి రెండో స్థానం

Spread the loveప్ర‌పంచ‌లోనే మ‌న దేశానికి రెండో స్థానం ద‌క్కింది. సెల్యూలార్ ఫోన్ల త‌యారీలో ఇండియా దూసుకెళ్లింది. చైనా త‌ర్వాతిRead More

pinky-lalwani-vijaya-mallya

మూడో పెళ్లికి మాల్యా రెడీ..

Spread the loveదేశంలో బ్యాంకుల‌కు ఎగ‌నామం పెట్టి లండ‌న్ లో కులాశాగా గ‌డుపుతున్న విలాస‌పురుషుడు విజ‌య్ మాల్యా మ‌రో సంచ‌ల‌నRead More

 • ఫేస్ బుక్ కి పెరుగుతున్న క‌ష్టాలు
 • ప్లాస్టిక్ నోట్లు వ‌స్తున్నాయ్…
 • పోర్బ్స్ లిస్టులో ఆయ‌నే టాప్
 • పడిపోయిన బంగారం ధరలు
 • మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు
 • పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…
 • వోడాఫోన్ బంపరాఫర్
 • 2వేల నోట్ల రద్దుపై ఆర్థికమంత్రి అనూహ్య సమాధానం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *