Main Menu

శామ్ సంగ్ ఫోన్ కి 4కెమెరాలు

Spread the love

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ తన కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోను మంగళవారం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు రియర్‌ (వెనుక వైపు) క్వాడ్‌ కెమెరాలతో శాంసంగ్‌ గెలాక్సీ ఏ9 (2018) స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్‌ భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్స్‌ను మంగళవారం (నవంబరు 20) ప్రారంభించింది. 6జీబీ, 8 జీబీ ర్యామ్‌ సామర్థ్యంతో రెండు వెర్షన్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ విడుదల చేసింది. ప్రపంచంలో క్వాడ్‌ కెమెరాలతో లాంచే చేసిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా గెలాక్సీ ఏ9ను శాంసంగ్‌ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధరను కంపెనీ రూ.36,990గాను. 8 జీబీ, 128 జీబీ అంతర్గత మెమోరీతో కూడిన వేరియంట్‌ ధరను కంపెనీ రూ.39,990గా నిర్ణయించింది. 6.3 అంగుళాల పూర్తిస్థాయి హెచ్‌డీ అమోలెడ్‌ తెర, 1080, 2160 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, స్నాప్‌డ్రాగన్‌ 660 సాక్‌ ప్రాసెసర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ అంతర్గత స్టోరీజీ, 512 జీబీ దాకా విస్తరించుకునే అవకాశంతో పాటు 24, 10, 8, 5, 24 ఎంపీ సెల్ఫీ కెమేరాలు ఈ ఫోన్‌ ప్రత్యేకం. 3800 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఈ ఫోన్‌ లభించనుంది.






Related News

మారుతీ కార్ల ధ‌ర‌ త‌గ్గింపు

Spread the loveమారుతీ సుజుకీ ఎంపిక చేసిన కొన్ని కార్లపై భారీ తగ్గింపును అందిస్తున్నట్టుగా ప్రకటించింది. మారుతీ సుజుకీ ప్రధానRead More

ఏప్రిల్‌ చివరికి శాంసంగ్‌ న్యూ మోడ‌ల్ ఫోన్

Spread the loveశాంసంగ్‌ త్వరలోనే భారత్‌లో ఫోల్డబుల్‌ (మడతపెట్టే) స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. అయితే ఎక్కువసార్లు మడతబెడితే ఈ ఫోన్‌Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *