మందేసిన మ‌ద‌పుటేనుగునిరా అంటున్న పైసా వ‌సూల్

nbk
Spread the love

బాలకృష్ణ, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ‘పైసా వసూల్‌’. ఈ సినిమాకు సంబంధించి మొన్న ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. తర్వాత టీజర్‌ వస్తుందని అనుకున్నాం. కానీ దానికి బదులుగా స్టంపర్‌ వస్తుందని కటింగ్‌ ఇచ్చాడు పూరీ. ఇది కొత్తగా ఉంటుందని, టీజర్‌కు విభిన్నంగా ఉంటుందని ఏవేవో చెప్పాడు. ఆ స్టంపర్‌ను ఈ డైరెక్టర్‌ శుక్రవారం ట్విట్టర్‌లో విడుదల చేశాడు. కానీ ట్రైలర్‌ ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా ఉండడం విశేషం. ‘తమ్ముడూ నేను జంగిల్‌ బుక్‌ సినిమా చూడలా. కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు’ అని బాలకృష్ణ తన మాస్‌మసాలా డైలాగ్స్‌ చెప్పినట్టే చెప్పి మెప్పించే ప్రయత్నం చేయబోయాడు. ఇంగ్లిష్‌లో కూడా కొన్ని డైలాగ్‌లు చెప్పాడు బాలయ్య. ఈ చిత్రం బాలకృష్ణకు 101 సినిమా. ఇందులో శ్రియ, ముస్కాన్‌,కైరా దత్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *