వివాదంంలో ఇరుక్కున్న పల్నాడు వైసీపీ ఎమ్మెల్యే

0

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు హ‌ద్దు మీరుతున్నారు. నోటికి ప‌ని చెబుతూ అభాసుపాల‌వుతున్నారు. తాజాగా ఆ జాబితాలో గుర‌జాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేరిపోయారు. ఈ యువ ఎమ్మెల్యే విద్యార్థుల‌తో వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదంగా మారుతోంది.

ఎస్‌ఎఫ్‌ఐ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి దౌర్జన్యానికి దిగారు. నరసరావుపేటలోని రెడ్డి కాలేజీలో అధిక ఫీజులపై విద్యార్థుల ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నేతలు మద్దతుగా నిలిచారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కాసు.. తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. త‌న కాలేజీలో అధిక ఫీజులు వ‌సూలు చేస్తున్న తీరుపై స్పందించాల్సి ఉన్న‌ప్ప‌టికీ దానికి భిన్నంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. విద్యార్థి సంఘం నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. వారిని భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

‘నా క్యాంపస్‌లోకి ఎందుకొచ్చారు..?. ఎస్‌ఎఫ్‌ఐ అయితే ఎవడికి గొప్ప?.. మీరు పది మందితో వస్తే నేను వందమందితో వస్తా. ఇష్టమైతే కాలేజీలో ఉండండి లేకపోతే వేరే కాలేజీకి వెళ్లండి. మీకు సేవలు చేయాల్సిన అవసరం నాకు లేదు’ అని కాసు మ‌హేష్ రెడ్డి వ్యాఖ్యానించ‌డ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. బాధ్య‌త క‌లిగిన ప్ర‌జా ప్ర‌తినిధిగా ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఫీజులు వ‌సూలు చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ నా ఇష్టం వ‌చ్చిన‌ట్టు చేసుకుంటాన‌ని ఆయ‌న అన‌డం త‌గ‌ద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గుర‌జాల వాసుల్లో ఎమ్మెల్యే తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here