రిప‌బ్లిక్ వేడుక‌ల‌తోనే విశాఖ‌కు రాజ‌ధాని !

0

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాజ‌కీయంగా ప్ర‌భావం చూపే అవ‌కాశం క‌నిపిస్తోంది. గ‌తంలో చంద్ర‌బాబు పాల‌నా కాలంలో వివిధ ప్రాంతాల్లో స్వ‌తంత్ర్య దినోత్స‌వ , గ‌ణ‌తంత్ర వేడుక‌లు నిర్వ‌హించేవారు. అందులో భాగంగా విశాఖ‌లో కూడా ఓసారి ఈ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం దానికి భిన్నంగా స్వ‌తంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించ‌గా ప్ర‌స్తుతం గ‌ణ‌తంత్ర వేడుక‌లు విశాఖ లో జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించింది.

మూడు రాజ‌ధానుల పేరుతో విశాఖ‌ను కేంద్ర స్థానంగా చేయాల‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అందుకు తాజాగా ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీల రిపోర్టులు తోడ్ప‌డ్డాయి. ఇక హైప‌వ‌ర్ క‌మిటీ తీర్మానం, ఆ వెంట‌నే క్యాబినెట్ ఆమోదం, అసెంబ్లీలో చ‌ర్చ మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. అన్నీ ఈనెల మూడో వారంలో పూర్తి చేయాల‌నే సంక‌ల్పంతో జ‌గ‌న్ ఉన్నారు. దాంతో నెలాఖ‌రు నాటికి కార్య‌నిర్వాహ‌క రాజ‌ధానిగా విశాఖ రూపాంత‌రం చెంద‌బోతోంది. అందుకు గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌తో ఆరంభం జ‌రగ‌బోతోంద‌ని చెప్ప‌వ‌చ్చు.

రాజ‌ధాని అంశంపై రేపు హైప‌వ‌ర్ క‌మిటీ స‌మావేశం కాబోతోంది. దాంతో ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా. ఆ త‌ర్వాత ఈనెల 17న ఈ క‌మిటీ తుది నివేదిక స‌మ‌ర్పిస్తుంది. దానిని 18న జ‌రిగే క్యాబినెట్ భేటీలో ఆమోదించే అవ‌కాశం ఉంది. అనంత‌రం అదే రోజు అసెంబ్లీలో మూడు రాజ‌ధానుల‌పై తీర్మానం ఆమోదించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. 20 నుంచి రాజ‌ధాని త‌ర‌లింపు ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. రిషికొండ‌లోని ట‌వ‌ర్స్ లో సెక్ర‌టేరియేట్ ఏర్పాటు చేయ‌బోతున్నారు. 26న గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడ‌కుల‌కు విశాఖ ఆతిథ్యం ఇవ్వ‌డం ద్వారా ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ హోదాకి శ్రీకారం ప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఏప్రిల్ నాటికి మొత్తం వ్య‌వ‌హారాల‌న్నీ విశాఖ‌కు త‌ర‌లించే ఆలోచ‌న‌తో ఏపీ ప్ర‌భుత్వం ఉంది. ఇప్ప‌టికే దానికి త‌గ్గ‌ట్టుగా భూముల ఎంపిక జ‌రుగుతోంది. ప‌లు భ‌వ‌నాల‌ను కూడా సిద్ధం చేశారు. దాంతో సెక్ర‌టేరియేట్ స‌హా స‌ర్వం ఈ వేస‌విలోనే మారిపోయే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here