మ‌ళ్లీ మోడీ చెంత‌కు మంచు ఫ్యామిలీ

0

టీడీపీ ఆవిర్భావంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి, అన్న‌గారి ఆశీస్సుల‌తో పెద్ద‌ల స‌భ‌లో అడుగుపెట్టిన మోహ‌న్ బాబు ఆ త‌ర్వాత చంద్ర‌బాబు తో విబేధించి టీడీపీకి దూర‌మ‌య్యారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ద్ధ‌తు ప‌లికారు. జ‌గ‌న్ కి జై కొడుతూ ప్ర‌చారం కూడా నిర్వ‌హించారు. ఇక తాజాగా ఆయ‌న బీజేపీ వైపు అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

నాలుగేళ్ల క్రితం గ‌తంలో ఓసారి మంచు మోహ‌న్ బాబు అండ్ ఫ్యామిలీ అంతా క‌లిసి ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యారు. అప్ప‌ట్లో స్వ‌చ్ఛ భార‌త్ కి మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు. మంచు ల‌క్ష్మిని బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కూడా ప్ర‌క‌టించారు. దాంతో అప్ప‌ట్లో మంచు ఫ్యామిలీ కాషాయం ధ‌రించే అవ‌కాశం ఉంద‌ని అంతా భావించారు. ఆ త‌ర్వాత మొన్న‌టి ఎన్నిక‌లకు ముందు మంచు మ‌నోజ్ ప్ర‌క‌ట‌న‌లు చూసి పొలిటిక‌ల్ గా ఆస‌క్తి చూపుతున్న‌ట్టు అంతా అంచ‌నా వేశారు. కానీ ఆ రెండూ జ‌ర‌గ‌లేదు.

ఇప్పుడు హ‌ఠాత్తుగా ఢిల్లీలో ప్ర‌త్య‌క్ష‌మ‌యిన మంచు ఫ్యామిలీ మ‌రోసారి పీఎంతో భేటీ అయ్యారు. ఈసారి మ‌నోజ్ వారి వెంట లేక‌పోవ‌డం విశేషం. అదే స‌మ‌యంలో మంచు విష్ణు భార్య భార్త‌లిద్ద‌రూ, మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి క‌లిసి ప్ర‌ధానితో భేటీ కావ‌డ‌డ‌మే కాకుండా బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షాని కూడా క‌లవ‌డం విశేషం. మంచు విష్ణు భార్య విరోనికా ఏపీ సీఎం జ‌గ‌న్ కి స‌మీప బంధువు కావ‌డం ఆస‌క్తిక‌రం.

మోహ‌న్ బాబు అనూహ్యంగా క‌మ‌లం గూటికి చేరితే దాని వెనుక ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఏమిట‌న్న‌ది ఆస‌క్తిని రేపుతోంది. ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీకి మోహ‌న్ బాబు కుటుంబం ఏమేర‌కు స‌హ‌క‌రిస్తుంద‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం . అదే స‌మ‌యంలో మోహ‌న్ బాబు స్నేహితుడు ర‌జ‌నీకాంత్ కూడా బీజేపీ వైపు చేర‌డానికి ఈ ప‌రిణామం దోహ‌దం చేస్తుందా అనే ప్ర‌శ్న కూడా ఉద‌యిస్తోంది. ఏమ‌యినా మంచు కుటుంబం రాజ‌కీయంగా ఎలా సాగుతుంద‌న్న‌ది కీల‌కాంశ‌మే కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here