బ‌క్క‌ప‌లుచ‌ని పిల్ల‌..బెబ్బులిలా మారింది..!

  0

  దేశ రాజ‌ధానిలో ఓ వైపు నిర్భ‌య ఘ‌ట‌న‌లో దోషుల ఉరిశిక్ష గురించి చ‌ర్చ సాగుతోంది. అదే స‌మ‌యంలో నిర్భ‌యంగా ముష్క‌రుల‌ను ఎదుర్కొంటున్న మ‌రో వ‌నిత అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఓ సాధార‌ణ‌ కార్మికుడి కుమార్తెగా ప‌శ్చిమ బెంగాల్ నుంచి హ‌స్తిన చేరుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా అత్యున్న‌త యూనివ‌ర్సిటీ విద్యార్థి నాయ‌కురాలిగా ఎదిగారు. అందుకే అయిషి ఘోష్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు.

  అన‌ర్గ‌ళ‌మైన ఉప‌న్యాస సామ‌ర్ధ్యం, అనేక అంశాల‌పై విశేష‌మైన అవ‌గాహ‌న‌తో ఆ బ‌క్క ప‌ల‌చ‌ని అమ్మాయి ఇప్పుడు ప్ర‌త్య‌ర్థుల‌కు మింగుడుప‌డిన స్థాయికి చేరారు. నాలుగేళ్ల క్రితం క‌న్హ‌య్య కుమార్ మాదిరిగా ఇప్పుడు అయిషి ఘోష్ మారుతున్నారు. బెంగాల్ లోని దుర్గాపూర్ లో ఆమె తండ్రి ఓ కార్మికుడిగా ప‌నిచేస్తున్నారు. తాను ఢిల్లీలో రాజ‌నీతి శాస్త్రం అధ్య‌య‌నం కోసం వ‌చ్చేటంత వ‌ర‌కూ లెఫ్ట్ తో అనుబంధం ఏర్ప‌డ లేదు. కానీ ఢిల్లీలో ఆమె ఎస్ ఎఫ్ ఐ ప‌ట్ల ఆక‌ర్షితురాల‌య్యారు. ఆసంఘంలో చురుగ్గా ప‌నిచేశారు. చివ‌ర‌కు ఎస్ ఎఫ్ ఐ నాయ‌కురాలిగా జేఎన్యూ అధ్యక్ష స్థానానికి బ‌రిలో దిగి విజ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. విదేశీ వ్య‌వ‌హారాల విభాగంలో పీజీ చేయ‌డానికి జేఎన్యూకి వ‌చ్చిన ఆమె ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు.

  జేఎన్యూలో ఫీజుల పెంపుద‌ల‌పై సాగుతున్న ఉద్య‌మం, ఎన్నార్సీ వ్య‌తిరేక ఉద్య‌మం ఒక ఎత్తు అయితే జ‌న‌వ‌రి 5 సాయంత్రం స‌బ‌ర్మ‌తి హాస్ట‌ల్ లో చొర‌బ‌డిన దుండ‌గుల దాడిలో ఆమెతో పాటు ప‌లువురు గాయ‌ప‌డిన ఘ‌ట‌న అంద‌రినీ ఉలిక్కిప‌డేలా చేసింది. అయితే తీవ్ర‌గాయాల‌తో ఎయిమ్స్ లో చికిత్స పొంది బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే ఒక్కో రాడ్ కి డిబేట్ తో స‌మాధానంతో చెబుతామంటూ అహింసా ప‌ద్ధ‌తిలోనే తాము సాగుతామ‌నే సంకేతం ఇవ్వ‌డం ద్వారా ఘోష్ అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఏబీవీపీ కి చెందిన వారు మార‌ణాయుధాల‌తో విద్యార్థుల‌పై దాడికి పాల్ప‌డిన‌ట్టు ఇప్ప‌టికే బాహాటంగా తెలుస్తోంది. టీవీ చ‌ర్చ‌ల్లోనూ కొంద‌రు అదే అంగీక‌రిస్తున్నారు. అయినా ప్ర‌భుత్వం వారిపై కేసు న‌మోదు చేయ‌డానికి వెన‌కాడ‌వ‌చ్చు గానీ జ‌నం దృష్టిలో ఓ అరాచ‌క గుంపుగా ఏబీవీపీ పేరుగాంచింద‌న‌డంలో సందేహం లేదు.

  అదే స‌మ‌యంలో అయిషి ఘోష్ వంటి యువ‌నేత‌ల తీరు దేశానికి మార్గ‌నిర్దేశం చేసే స్థాయికి చేరుతోంది. ఓవైపు దేశంలో ఆర్థిక సంక్షోభం, అంత‌ర్జాతీయంగా యుద్ధ‌మేఘాలు క‌మ్ముకుంటున్న వేళ విద్యార్థి ఉద్య‌మానికి వేగుచుక్క‌ల్లా ఇలాంటి వారు నిలిచిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంది. సామాజిక స్పృహ‌తో దేశ భ‌విష్య‌త్ కోసం పోరాడుతున్న క్ర‌మంలో వారి ప‌రాక్ర‌మం అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here