బిగ్ బాస్ విన్న‌ర్ తో పున‌ర్నవి ప్రేమాయ‌ణం సంగ‌తేంటి?

0

రాహుల్‌ సిప్లిగంజ్‌.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. దానికి కారణం ఆయన బిగ్ బాస్ టైటిల్ గెలవడం ఒకటైతే.. మరోటి పునర్నవి భూపాలంతో ప్రేమాయణం. అప్పటి వరకు రాహుల్‌ అంటే కొందరికి మాత్రమే తెలుసు.. కానీ బిగ్ బాస్ వచ్చిన తర్వాత అందరికీ పరిచయం అయ్యాడు. ఇక పున్ను బేబీతో మనోడి లవ్ ట్రాక్ మొదలైన తర్వాత చాలా మందికి తెలిసిపోయాడు.. ఫేమస్ అయిపోయాడు. ఇక ఇప్పుడు ఇంటి నుంచి టైటిల్ గెలిచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ ట్రోఫీ గురించి కాకుండా పునర్నవితో లవ్ గురించి అడుగుతున్నారు. పైగా గెలిచిన తర్వాత ఓ టీవీ ఛానెల్‌కు వచ్చిన రాహుల్ సిప్లిగంజ్‌కు పున్ను గురించే ప్రశ్నలు వచ్చాయి.

ఈ ఇద్దరి గురించి ప్రస్తుతం అభిమానుల్లో కూడా చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. మీ ఇద్దరి గురించి చెప్పండంటూ ఓ అభిమాని ప్రశ్నించగా.. పున్నుతో కలిసి త్వరలోనే లైవ్‌లోకి వస్తానని క్లారిటీ ఇచ్చాడు రాహుల్. అన్నట్లుగానే లైవ్ కన్సర్ట్‌లో పున్నుతో డ్యూయెట్స్ పాడాడు రాహుల్. దాంతో పాటు అలీతో సరదాగా షోకు వచ్చాడు. దానికంటే ముందు కూడా ఓ లైవ్ షోకు వెళ్లారు. ఇక యాంకర్ రవితో కూడా ఓ ఇంటర్వ్యూ చేసారు. ఇలా ఎక్కడికి వచ్చినా కూడా ఇద్దరూ కలిసే వస్తున్నారు. దాంతో పున్ను రాహుల్ బంధంపై ఎక్కడా క్లారిటీ రావట్లేదు సరికదా కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. పున్ను తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు రాహుల్. కానీ ఒక్కోసారి అంతకంటే ఎక్కువే అంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. తనను పున్ను ఘోరంగా సపోర్ట్‌ చేసిందని.. కొన్నిసార్లు తాను వినకపోతే తిట్టి మరీ చెప్పిందని గుర్తు చేసుకున్నాడు.

ఈ మధ్యే అలీతో సరదాగా ఈ ఇద్దరూ కలిసి రచ్చ చేసారు. ఇది చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇప్పుడు ఓంకార్ సిక్స్ సెన్స్ షోకు వచ్చారు. అక్కడ పాట పాడుతూ పున్నుతో ఆడుకున్నాడు రాహుల్. పున్ను పున్ను పున్ను.. సైకో దీనిపేరు అంటూ పాడి ఆట పట్టించాడు రాహుల్ సిప్లిగంజ్. దాంతో చేతిలో ఉన్న సుత్తితో ఒక్కటిచ్చింది పునర్నవి. ఇదే షోకు వరుణ్ సందేశ్, వితికా షెరూ కూడా వచ్చారు. పున్ను రాహుల్ కెమిస్ట్రీ చూస్తుంటే త్వరలోనే శుభవార్త చెప్తారేమో అనిపిస్తుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here