బాబు-భువ‌నేశ్వ‌రితో అమ‌రావ‌తి రైతుల‌కు లాభ‌మా? న‌ష్ట‌మా?

0

తెలంగాణా ఆర్టీసీ స‌మ్మె గుర్తుందా. కార్మికులు రోడ్డెక్కి ల‌బోదిబోమంటే కేసీఆర్ ఉలుకూ ప‌లుకూ లేకుండా సాగిపోయారు. స‌మ్మె విష‌యంలో తాను స్పందిస్తే విప‌క్షాల‌కు మైలేజీ పోతుంద‌నే ల‌క్ష్యంతో కేసీఆర్ వ్య‌వ‌హ‌రించారు. చివ‌ర‌కు స‌మ్మె విర‌మించిన త‌ర్వాత విందు భోజ‌నం తోపాటుగా స‌మ్మె కాల‌పు జీతం కూడా విడుద‌ల చేసి కార్మికుల డిమాండ్లు నెర‌వేర్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం రోడ్డెక్కిన అమ‌రావ‌తి ప్రాంత రైతుల స‌మ‌స్య కంటే అది తీవ్ర‌మ‌యిన‌ది. నేరుగా ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూపించేది. రాష్ట్ర‌మంతా స‌మ్మె కార‌ణంగా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి రావ‌డంతో స‌ర్కారు బాధ్య‌త వ‌హించాల్సి వ‌చ్చింది. అయినా అక్క‌డ కేసీఆర్ వెన‌క్కి త‌గ్గ‌లేదు.

ఏపీలో సీఎంగా ఉన్న జ‌గ‌న్ ని కేసీఆర్ క‌న్నా మొండివాడిగా ప‌లువురు చెప్పుకొస్తారు. అలాంట‌ప్పుడు విప‌క్షాలు ఆందోళ‌న చేస్తే ఇక్క‌డ ముఖ్య‌మంత్రి మాత్రం ఎందుకు స్పందిస్తార‌న్న‌ది సందేహంగా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు తో పాటుగా ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి రోడ్డెక్కినా అమ‌రావ‌తి రైతాంగానికి న్యాయం జ‌రిగే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. బాబు బోర్లా ప‌డినా, ప‌వ‌న్ రోడ్డున వెల్ల‌కిలా ప‌డినా జ‌గ‌న్ లో మాత్రం చ‌లనం క‌నిపించేలా లేదు. తాను అనుకున్న‌ది చేయ‌డానికి సీఎం సిద్ధ‌మ‌వుతున్నారు.

అలాంటి స‌మ‌యంలో జ‌గ‌న్ ని ఒప్పింది, త‌మ డిమాండ్లు నెర‌వేర్చుకోవ‌డానికి అమ‌రావ‌తి రైతులు సిద్ధం కావాల్సి ఉంటుంది. కానీ ఇప్ప‌టికే అమ‌రావ‌తి ఆందోళ‌న పూర్తిగా రాజ‌కీయ రంగు పులుముకుంది. త‌మ స‌మ‌స్య తీర్చాల‌ని కోరేవారు కంటే జ‌గ‌న్ నాశ‌నం కావాల‌ని ఆశించే వాళ్లే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. దాంతో వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతోంది. ఆందోళ‌న‌లు తీవ్ర‌తీరం చేయాల‌ని చూస్తున్న తెలుగుదేశం పార్టీ నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాలు చివ‌ర‌కు అమ‌రావ‌తి రైతుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లేలా క‌నిపిస్తున్నాయి. ప్ర‌భుత్వంతో చ‌ర్చించి, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునే బ‌దులుగా రోడ్డెక్కి ర‌చ్చ చేయ‌డం ద్వారా తాము ల‌క్ష్యాల‌ను సాధించాల‌ని అమ‌రావ‌తి రైతులు ఆశిస్తున్నారు. కానీ ప్ర‌భుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

అమ‌రావ‌తి ప్రాంత రైతాంగం ఆందోళ‌న‌ను విర‌మించినా లేకున్నా మూడు రాజ‌ధానుల విష‌యంలో వెన‌క్కి త‌గ్గేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌ప‌డ‌డం లేదు. దాంతో సీన్ ముదురుతోంది. ఈ నేప‌థ్యంలో ఒక‌రోజు ప‌వ‌న్, మ‌రో రోజు భువ‌నేశ్వ‌రి వంటి వారి రాక‌తో రాజ‌ధాని ఆందోళ‌న‌లకు మీడియాలో లైవ్ లో క‌నిపించ‌డానికి దోహ‌దం చేస్తాయే త‌ప్ప‌, రైతుల‌కు మేలు చేసే అవ‌కాశాలు స్వ‌ల్పంగా నే ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here