బాబు చుట్టూ ఉచ్చు బిగిస్తున్న‌ జ‌గ‌న్!?

0

ఏపీ రాజ‌కీయాల్లో హీటు రాజుకుంది. ఇన్నాళ్లుగా కాస్త సామ‌ర‌స్యంగా ప‌య‌నించిన జ‌గ‌న్ ఇక త‌న పొలిటిక‌ల్ వ్యూహాల‌కు ప‌దును పెట్టాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం. తాజాగా స్థానిక ఎన్నిక‌ల వాయిదా వెనుక ఏదో కుట్ర ఉంద‌నే నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన జ‌గ‌న్ ఇక స‌హించ‌కూడ‌ద‌నే నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందులో భాగంగా తాము త‌లుపులు తెరిస్తే చంద్ర‌బాబుకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఉంద‌డ‌ద‌ని ఏడాది క్రితం తొలి అసెంబ్లీ స‌మావేశాల సాక్షిగా చెప్పిన విష‌యాన్ని ఇప్పుడు ఆచ‌ర‌ణ‌లోకి తీసుకురావాల‌నే సంక‌ల్పంతో ఉన్న‌ట్టు చెబుతున్నారు.

ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు చేజారిపోయారు. గ‌న్న‌వ‌రం , గుంటూరు. చీరాల ఎమ్మెల్య‌లు బాబుకి ఝ‌ల‌క్ ఇచ్చి జ‌గ‌న్ కి జై కొట్టేశారు. మ‌రో ముగ్గురు నేతలు దూరం అయితే బాబుకి ప్ర‌త్యేక హోదా గ‌ల్లంత‌వుతుంది. అయితే కేవ‌లం ప్ర‌తిప‌క్ష హోదా మాత్ర‌మే కాకుండా టీడీపీ లో బాబు నాయ‌క‌త్వానికే ఎస‌రు పెట్టాల‌నే కాంక్ష‌తో జ‌గ‌న్ ఉన్న‌ట్టుగా భావిస్తున్నారు. దాంతో ప‌లువురు ఎమ్మెల్యేల‌తో మాట్లాడి చంద్ర‌బాబుకి సెగ పెట్టే స్కెచ్ సిద్ధం చేస్తున్నారు.

వాస్త‌వానికి ఇలాంటి ప్ర‌య‌త్నం బీజేపీ నేత‌లు చేశారు. గంటా శ్రీనివాస‌రావు నాయ‌క‌త్వంలో టీడీపీని చీల్చి ప్ర‌త్యేక బృందంగా స‌భ‌లో ఏర్పాటు చేయాల‌ని యోచించారు. కానీ బీజేపీ వైపు ఎమ్మెల్యేలు మొగ్గుచూప‌కోవ‌డంతో వ్యూహాలు ఫ‌లించ‌లేదు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ జెండా ఊప‌డంతో క‌నీసంగా మ‌రో ప‌ది మంది ఎమ్మెల్యేలు బాబుకి గుడ్ బై చెప్పేసేందుకు సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. వారంద‌రూ క‌లిసి టీడీపీని చీల్చేదిశ‌లో ప్ర‌య‌త్నాలు ప్రారంభించే అవ‌కాశం లేక‌పోలేద‌ని స‌మాచారం. అంతా అనుకున్న‌ట్టు సాగితే బాబుని టీడీపీ కుర్చీకి దూరం చేసి కొత్త కుంప‌టి రాజేయాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అది అంతా సామాన్యం కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన స‌త్యం. అయిన‌ప్పటికీ భారీ ల‌క్ష్యంతో ప్రారంభించిన ఈ ప్ర‌య‌త్నానికి రాబోయే బ‌డ్జెట్ స‌మావేశాల లోగా ఓ రూపు వ‌స్తుంద‌ని స‌మాచారం. దాంతో చంద్ర‌బాబుకి ప‌ద‌వికి గండం పొంచి ఉన్న త‌రుణంలో ఆయ‌న త‌న పార్టీని, త‌న నాయ‌క‌త్వాన్ని ఎలా కాపాడుకుంటార‌న్న‌ది పెద్ద ప‌రీక్ష కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here