ప్ర‌భాస్ వ‌చ్చేశాడు..ఉగాదికే ఫ్యాన్స్ ముందుకు!

0

బాహుబ‌లి బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో అమాంతంగా పెరిగిన ఇమేజ్ నిల‌బెట్టుకోవ‌డం ఇప్పుడు ప్ర‌భాస్ కి పెద్ద ప‌రీక్ష‌గా మారుతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా సాహో అనిపించుకోవాల‌ని చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. దాంతో ఇక ఇప్పుడు కొత్త చిత్ర కోసం ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

తాజా సినిమా కోసం ప్ర‌భాస్ జార్జియాను చుట్టేశారు . కొన్ని ఫైట్లు, కూసిన్ని డైలాగ్స్‌తో జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొన్ని కీలక సన్నివేశాల కోసం జార్జియా వెళ్లింది చిత్రబృందం.

కరోనా ప్రభావం, వర్షాలను సైతం లెక్క చేయకుండా ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ‘‘డార్లింగ్‌ (ప్రభాస్‌) మళ్లీ తన డార్లింగ్స్‌ (స్నేహితులు) దగ్గరకు వచ్చేశారు. జార్జియాలో షెడ్యూల్‌ను పూర్తి చేశాం. త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేస్తాం’’ అని ట్వీట్‌ చేశారు దర్శకుడు రాధాకృష్ణ. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసి, టైటిల్‌ను ప్రకటించాలనుకుంటున్నారని సమాచారం. ఈ ఏడాది అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here