పొర‌పాటుకి వివ‌ర‌ణ ఇచ్చుకున్న‌ 10టీవీ

0

ఏపీ వ్య‌వ‌హారాల్లో చిన్న చిన్న అంశాలు కూడా పెద్ద ప్ర‌భావం చూపుతున్నాయి. మీడియాకు ఇది పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న అంశాన్ని తెర‌మీద‌కు వ‌చ్చేస్తే ఆ త‌ర్వాత త‌ల‌వంపులు త‌ప్ప‌డం లేదు. గ‌తంలో ఏపీ 24 7 చానెల్ ఇలాంటి పొరపాటు కార‌ణంగానే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వ‌చ్చింది. తాజాగా 10టీవీ వంతు వ‌చ్చింది.

అమ్మ ఒడి ప‌థ‌కంపై ఇప్పుడు అంద‌రి దృష్టి పడింది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు మాత్ర‌మే అది వ‌ర్తిస్తుందంటూ ఓ పోస్ట్ వాట్సాప్ లో వ‌చ్చింది. దానిని వెంట‌నే షేర్ చేసిన 10టీవీ ప్ర‌తినిధులు ఓ క‌థ‌నం అల్లేశారు. తాజాగా ఈ ప‌థ‌కం అమ‌లు గురించి ముఖ్య‌మంత్రి స‌మీక్షించిన సంద‌ర్భంగా జ‌రిగిన ఈ పొర‌పాటు కి చివ‌ర‌కు 10టీవీ యాజ‌మాన్యం వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. పెద్ద స్థాయిలో సోష‌ల్ మీడియాలో చిన్న క్లిప్పింగ్ వైర‌ల్ మార‌డం ఆ చానెల్ కి త‌ల‌నొప్పిని తెచ్చింది.

ప్ర‌స్తుతం మై హోమ్స్ గ్రూప్ సంస్థ‌లో ఉన్న 10టీవీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌ట్ల సానుకూలంగా ఉంటోంది. ఈ నేప‌థ్యంలో అదే సంస్థ నుంచి వ‌చ్చిన క‌థ‌నం క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే ఈ మీడియా గ్రూప్ కే చెందిన టీవీ9 మీద అమ‌రావ‌తి రైతులు మండిప‌డుతున్నారు. ఏకంగా మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ మీద దాడికి పాల్ప‌డి, కారు అద్దాలు ధ్వంసం చేశారు. అదే స‌మ‌యంలో 10టీవీ నుంచి ప్ర‌భుత్వానికి సంబంధించిన క‌థ‌నంలో జ‌రిగిన అత్యుత్సాహం కొత్త స‌మ‌స్య‌ను తెచ్చిపెట్టింది.

ప్ర‌భుత్వ‌, ప్రైవేటు తో పాటు అంద‌రికీ ఈ ప‌థ‌కం వ‌స్తుందంటూ అదే రోజు సాయంత్రానికి ప్ర‌భుత్వం నుంచి వివ‌ర‌ణ వ‌చ్చింది. కానీ అప్ప‌టికే విష‌యం జ‌నంలోకి వెళ్లిపోవ‌డంతో వివ‌ర‌ణ ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో 10టీవీ వివ‌ర‌ణ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here