Main Menu

మ‌హిళా చైత‌న్యంతో న‌యా రికార్డ్

Spread the love

కొత్త సంవ‌త్స‌రం కొంగొత్త రికార్డ్ కి శ్రీకారం చుట్టింది. మ‌ల‌బారు తీరంలో మ‌హిళా చైత‌న్యం వెల్లువిరిసింది. ప్ర‌పంచంలోనే అతిపెద్ద మహిళా మాన‌వ‌హారం మొగ్గ తొడిగింది. రికార్డ్ పుట‌లకెక్కింది. కొత్త‌ సంవత్సరం తొలిరోజున సమానహక్కుల కోసం కేరళ మహిళలు కదం తొక్కడం చారిత్ర‌క ఘ‌ట్టంగా మారింది.. వందలు వేలు కాదు 35 లక్షల మంది కదలివచ్చి మహిళా మహా కుడ్యాన్ని సృష్టించారు. లింగవివక్షతను, అణచివేతను ప్రశ్నించారు. అన్నిరంగాల్లో సమానహక్కులు సాధిస్తామని, అంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతిన చేశారు.

రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుంచి ఉత్తరాన రాష్ట్ర చివరన ఉన్న కాసరగోడ్‌ వరకూ 620 కిలోమీటర్ల పొడవునా ఈ మహాకుడ్యం ఏర్పాటైంది. 14 జిల్లాలోని జాతీయ రహదారులు మహిళల, వారికి మద్దతుగా కదలివచ్చిన అభ్యుదయ శక్తుల నినాదాలతో మారు మోగింది. కేరళ మహిళలు సాధించిన ఈ విజయాన్ని యూనివర్శల్‌ రికార్డు ఫోరమ్‌ గుర్తించింది. ’35 లక్షల మంది మహిళలు ఏర్పాటు చేసిన అతిపొడవైన మానవహారం’గా దీనిని నమోదుచేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ మానవహారాన్ని ప్రారంభించారు. , సుమారు అర గంటపాటు సాగింది. కులమతాలకు, హోదాలకు అతీతంగా ఈ మహిళలు ఇందులో పాల్గొన్నారు.

అలాగే మహిళా కుడ్యానికి సంఘీభావంగా దాని వెనక పురుషులు మానవహారం నిర్మించారు. ఇందులో ప్రముఖ పురుష రచయితలు, కళాకారులు పాల్గొన్నారు. ఈ మహిళా కుడ్యం ఏర్పాటుతో రహదారులన్నీ సందడిగా మారాయి. మహిళలు తమ నినాదాలతో మహిళా కుడ్యం నిర్మించిన ప్రాంతాలను హోరెత్తించారు. లింగ వివక్ష అంతం కావాలని పిలుపునిచ్చారు. సినీనటులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖలు కూడా ఇందులో పాల్గొన్నారు. తిరునంతపురంలో ఈ కార్యక్రమం సందర్భంగా స్వామి అగ్నివేష్‌ మహిళలకు మద్దతు తెలిపారు. ఈ హారం ముగింపు ప్రాంతం వెల్లయంబళమ్‌ వద్ద చివరి వ్యక్తిగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి కెకె శైలజ నిలిచారు.






Related News

క‌మ‌లం, కాంగ్రెస్ ప‌ని అంతే..!

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో క‌మ‌లం దాదాపుగా కుదేల‌య్యింది. నాలుగేళ్ల క్రితం కాస్త ఉత్సాహంతో క‌ళ‌క‌ళలాడిన వారి క్యాంప్ ఇప్పుడుRead More

మోడీ స‌ర్కారుకి మ‌రో ఎదురుదెబ్బ‌

Spread the loveమోడీ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలింది. తాజాగా సీబీఐలో జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *