Main Menu

ఆ పాటకు మద్ధతుగా సీఎం

Spread the love

కేరళ సీఎం మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఆయన సినిమా పాటకు మద్దతుగా నిలిచారు. ఇటీవల బాగా పాపులర్ అయిన సాంగ్ కి ఆయన భావప్రకటనా స్వేచ్ఛ అంటూ సమర్థించారు.కళలో భావ ప్రకటన స్వేచ్ఛపై అసహనాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని సీఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. ప్రియా ప్రకాష్ ముఖ కవళికల మూలంగా విశేషంగా ఆకట్టుకున్న పాట ఇప్పుడు వైరల్ అయ్యింది. అయితే ఆ పాట తమ సంప్రదాయాలకు భిన్నంగా ఉందని, వెంటనే తొలగించాలని పలువురు ముస్లీం సంస్థల ప్రతినిధులు కేంద్రానికి లేఖలు రాశారు. సెన్సార్ బోర్డ్ కి, మంత్రి స్మ్రుతి ఇరానీకి లేఖలు పంపించాయి

ఈ నేపథ్యంలో ఆ పాట పుట్టుపూర్వోత్తరాల గురించి సీఎం పూర్తి వివరాలు తెలియజేశారు. మాప్పిలపట్లు అనే ముస్లిం సంప్రదాయ పాట ఆధారంగా పీఎంఏ జబ్బర్‌ రాసిన ఈ పాటను రఫీఖ్‌ పాడారు. 1978 ఆకాశవాణిలోనే ఈ పాట ప్రసారమైంది. ఏళ్ల తరబడి ముస్లింల వివాహాల్లో ఈ పాటను పాడుతున్నారు కూడా. అలాంటప్పుడు ఒప్పుడు కొత్తగా అభ్యంతరం ఏంటి? ఛాందసవాదం, మతతత్వంపై పోరాటానికి కళలు, సాహిత్యం ఆయుధాలు. వాటిని నాశనం చేసే ప్రయత్నం మంచిది కాదు అని విజయన్‌ తెలిపారు.






Related News

మోడీకి మ‌రో షాక్, మంత్రి రాజీనామా

Spread the loveసెమీ ఫైన‌ల్స్ గా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌డానికి కొన్ని గంట‌ల‌ ముందు బీజేపీ షాక్Read More

5 రాష్ట్రాల ఎన్నిక‌ల‌పై ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి

Spread the love వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు సెమీఫైన‌ల్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఎన్నిక‌లRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *