బీజేపీకి ఝలక్: యువ ఎంపీ గుడ్ బై

varungandhi-lead-m
Spread the love

పార్టీ అధినాయకత్వం తనను నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా సంజయ్‌గాంధీ కుమారుడు, సుల్తాన్‌పూర్ లోక్‌సభ సభ్యుడు వరుణ్‌గాంధీ త్వరలోనే బిజెపికి గుడ్‌బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటినుండి తనను నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఆయన తీవ్ర అసంతృత్తితో ఉన్నారు. వరుణ్‌గాంధీ ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను కలిసి పార్టీ తనను నిర్లక్ష్యం చేయటం గురించి చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకపాత్ర లభిస్తుందని ఆశించిన వరుణ్‌గాంధీకి నిరాశ ఎదురైంది. నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఆయను పక్కనపెట్టి గోరఖ్‌పూర్ లోక్‌సభ సభ్యుడు యోగి అధిత్యనాథ్‌కు పట్టం కట్టారు. అప్పటినుండి వరుణ్‌గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తి వ్యక్తం చేసిన వరణ్‌గాంధీకి నచ్చ జెప్పేందుకు పలువురు కేంద్ర మంత్రులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదని తెలుస్తోంది. ఇలావుండగా, వరుణ్ గాంధీ ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాగా సన్నిహితమయ్యారని చెబుతున్నారు.

వరుణ్ గాంధీ పదిరోజుల క్రితం రాహుల్‌తో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది. బిజెపిలో చాలాకాలం నుండి పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న వరుణ్ గాంధీ తన స్వంత రాజకీయంపై దృష్టి సారించారు. వరుణ్‌గాంధీ బిజెపి నుండి తప్పుకునే పక్షంలో ఆయన తల్లి, కేంద్ర శిశు, మహిళా సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ కూడా మంత్రి పదవితోపాటు బిజెపి నుండి తప్పుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


Related News

adityanath-kh0F--621x414@LiveMint

చంపేస్తామంటున్న సీఎం యోగి

Spread the loveయూపీలో సీఎం యోగీ ఆదిత్యానంద్ మళ్లీ నోటికి పనిచెబుతున్నారు. ముఖ్యమంత్రిగా కొన్నాళ్ల పాటు ఓపికగా వ్యవహరించిన ఆయనRead More

Vijayalakshmi-Pandit-Ambassador-to-Russia-received-at-the-Delhi-airport-by-brother-Jawaharlal-Nehru.

నెహ్రూ స్త్రీలోలుడా..?

Spread the loveదేశంలో పరిణామాలు చాలామార్లు ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్ని సార్లు ఆందోళనకరంగా మారుతున్నాయి. పెను ప్రమాదమే పొంచి ఉందనేRead More

 • సంచలనంగా మారిన కేరళ సీఎం నిర్ణయం
 • నిజాయితీకి 45వ సారి బదిలీ
 • గుజరాత్ కి ముందు బీజేపికి గట్టిదెబ్బ
 • నిజాలు నిలబడతాయి మోడీజీ…!
 • బీజేపీ నేత అశ్లీల చిత్రాలు హల్ చల్
 • మోడీ సొంత నియోజకవర్గంలో కాషాయం ఓటమి
 • కమల్‌ హాసన్‌పై కేసు
 • గ్యాస్ ధర మళ్లీ..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *