బీజేపీ రాష్ట్రాలు నేరాలమయం

244011-crimes
Spread the love

ఉత్తరప్రదేశ్‌.. నేరాలకు నిలయంగా మారింది. రాష్ట్రంలో రోజురోజుకూ నేరాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. దేశంలో గతేడాది నమోదైన మొత్తం క్రిమినల్‌ కేసుల్లో యూపీ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. అంతేకాదు.. హత్యల్లోనూ ఆ రాష్ట్రానిదే మొదటి స్థానం. లైంగికదాడుల కేసుల్లో బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌ టాప్‌లో నిలిచింది. గతేడాది దేశవ్యాప్తంగా నమోదైన వివిధ కేసుల వివరాలను నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది.

ఈ గణాంకాల ప్రకారం.. చాలా విభాగాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ నేరాలు జరిగాయి. 2016లో దేశంలో మొత్తం 48,31,575 కేసులు నమోదు కాగా.. వాటిలో యూపీ నుంచి 4,58,993(9.5 శాతం) ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 4,30,004(8.9 శాతం), మహారాష్ట్రలో 4,25,173(8.8 శాతం) కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 30,450 హత్య కేసులు నమోదుకాగా.. యూపీ 4,889(16 శాతం), బీహార్‌ 2,581(8.5 శాతం), మహారాష్ట్ర 2,299(7.6శాతం) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మహిళలపై లైంగికదాడుల కేసుల్లో(38,947) మధ్యప్రదేశ్‌(4,882) ముందు వరుసలో ఉండగా.. యూపీ, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దళితులపై దాడుల్లో యూపీ, బీహార్‌, రాజస్థాన్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. గతేడాదిలో ఐపీసీ సెక్షన్‌ కింద తెలంగాణలో 1,08,991, ఆంధ్రప్రదేశ్‌లో 1,06,774 కేసులు నమోదయ్యాయి. మహిళలపై వేధింపులు, లైంగికదాడుల కేసుల్లో దేశంలోని మెట్రో నగరాల్లోకెల్లా ఢిల్లీ తొలిస్థానంలో ఉన్నది.

2016లో దళితులపై దాడులు 5.5 శాతం మేర పెరిగాయి. సైబర్‌ నేరాలు కూడా యూపీ లోనే ఎక్కువగా(2,639 కేసులు) జరిగాయి. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర, కర్నాటకలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2015తో పోలిస్తే గతేడాదిలో సైబర్‌ నేరాలు 6.3 శాతం పెరిగాయి.

మొత్తం క్రిమినల్‌ కేసులు 48,31,515
ఉత్తరప్రదేశ్‌ 4,58,993
మధ్యప్రదేశ్‌ 4,30,004
మహారాష్ట్ర 4,25,173

హత్యలు (30,450)
ఉత్తరప్రదేశ్‌ 4,889
బీహార్‌ 2,581
మహారాష్ట్ర 2,299

కిడ్నాప్‌ కేసులు (89,875)
ఉత్తరప్రదేశ్‌ 15,898
మహారాష్ట్ర 9,333
బీహార్‌ 7,324

లైంగికదాడులు (38,947)
మధ్యప్రదేశ్‌ 4,882
ఉత్తరప్రదేశ్‌ 4,816
మహారాష్ట్ర 4,189

దళితులపై దాడులు (40,801)
ఉత్తరప్రదేశ్‌ 10,426
బీహార్‌ 5,701
రాజస్థాన్‌ 5,134


Related News

SC Justices

దేశాన్ని కుదిపేస్తున్న ఆ రెండు కేసులు

Spread the loveసుప్రీంకోర్టులో కీలక కేసులకు బెంచీల కేటాయింపు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా జరుగుతోందా? తాజా పరిణామాల నేపథ్యంలోRead More

bhima-koregaon-latest

బరితెగించి దాడులు

Spread the loveదేశంలో ఇప్పటికే మతఘర్షణలు పెరుగుతున్నాయి. అన్ని చోట్లా వివాదాలు రాజుకుంటున్నాయి. పెద్ద సమస్యగా మారుతున్నాయి. మత సామరస్యంRead More

 • బీజేపీలో మంటరాజేసిన హార్థిక్
 • బీజేపీ ఎంపీకి జైలుశిక్ష
 • కోర్ట్ పై కాషాయ జెండా
 • మళ్లీ పప్పులో కాలేసిన మోడీ!
 • ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం
 • మోడీ ఖర్చు చూస్తే ముక్కున వేలేసుకుంటారు..
 • ప్రధానమంత్రిపై కార్పోరేట్ కంపెనీ కేసు
 • రాహుల్ సొంతగూటిలో కమల వికాసం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *