Main Menu

43 ఏళ్ల రికార్డ్ స్థాయికి నిరుద్యోగం

Spread the love

అధికారంలోకి వచ్చేముందు ఎన్నికల వాగ్ధానాల్లో ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామంటూ గద్దెనెక్కిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ దిశగా చేసింది శూన్యమే అంటున్నాయి గణాంకాలు. ఏడాదికి కోటి ఉద్యోగాలంటూ యువతలో పెద్దఎత్తున ఆశల్ని కల్పించింది బీజేపీ… కానీ, ఆ ఆశలు అడియాశలయ్యాయి. కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం, ఉపాధిరంగంలో యువతకు దక్కుతున్న అవకాశాలు రోజురోజుకీ క్షీణించాయనే లెక్కలు చెబుతున్నాయి.

నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ), పిరియడ్ కార్మిక శక్తి సర్వే (పిఎఫ్ఎఫ్ఎస్) ప్రకారం దేశం నిరుద్యోగిత రేటు 2017-18లో 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా 6.1 శాతంగా నమోదైంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ (సీఎంఐఈ), లేబర్‌ ఫోర్స్‌ (ఎల్‌బీ) తాజా సర్వేలు ఈ విషయాల్ని గణాంకాల రూపంలో, గ్రాఫిక్స్‌రూపంలో స్పష్టం చేస్తున్నాయి. కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం దారుణంగా పడిపోయిందన్న అంశం ఈ మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మహిళల భాగస్వామ్యమే కాదు, మొత్తంగా ఉన్నత విద్య పూర్తి చేసుకున్న యువతీ యువకుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని పేర్కొంది.

నేషనల్ స్టాటిస్టికల్ కమీషన్ (ఎన్‌ఎస్‌సీ) ఆమోదం ఉన్నప్పటికీ ప్రభుత్వం దాని విడుదలను నిపివేసిందనే వివాదం మొదలు కావడంతో ఎన్‌ఎస్‌సీ చైర్మన్, ఇద్దరు సభ్యులు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.






Related News

బీజేపీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సెహ్వాగ్

Spread the loveడ్యాషింగ్ ఓపెన‌ర్ గా మైదానంలోనూ,, మాట‌ల జోరుతో ట్విట్ట‌ర్ లోనూ చెల‌రేగిపోయే సెహ్వాగ్ ని వాడుకోవాల‌ని చూసినRead More

ఏపీ ప్ర‌జ‌ల‌కు నెల‌న్నర‌ ఎదురుచూపులు

Spread the loveఏడు ద‌శ‌ల్లో సాదార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలి విడ‌త ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌రుగుతుండ‌గా 91 స్థానాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *