Main Menu

క‌ర్ణాట‌క వైపు చూస్తున్న టీడీపీ

Spread the love

దేశ రాజ‌కీయాల్లో ఇప్పుడు క‌ర్ణాట‌క కీల‌కం కాబోతోంది. వ‌రుస‌గా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తున్న న‌రేంద్ర‌మోడీకి అస‌లైన ప‌రీక్ష క‌ర్ణాట‌క గ‌డ్డ మీద ఎదురుకాబోతోంది. ముఖ్యంగా ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి, సొంత పార్టీలో పెరుగుతున్న అస‌మ్మ‌తి స్వ‌రాలు, దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో నిర‌స‌న‌లు, చివ‌ర‌కు పార్ల‌మెంట్ ని కూడా న‌డిపించ‌లేక చేతులెత్తేసిన వైఫ‌ల్యాలు క‌లిసి మోడీని ఇర‌కాటంలోకి నెట్టాయి. ఈ ద‌శ‌లో కాంగ్రెస్ కి కొత్త ఊపు క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో క‌న్న‌డ ఓట‌ర్ల తీర్పు వెలువ‌రించాల్సి రావ‌డం క‌మ‌ల‌ద‌ళానికి కాస్త క‌ష్టంగా మారింది. అదే ఇప్పుడు మోడీ వ్య‌తిరేకుల‌కు ఆశాభావంగా మారింది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి పాల‌యితే అది దేశ రాజ‌కీయాల్లో కీల‌క‌మ‌లుపు కాగ‌ల‌ద‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి. విప‌క్షాల‌కు కొత్త శ‌క్తి చేకూరుతుంద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కొత్త ఫ్రంట్ కోసం ప‌లువురు నేత‌లు ప్ర‌య‌త్నిస్తుండ‌డం, విప‌క్షాల‌ను క‌లుపుకుని కాంగ్రెస్ ఆందోళ‌న‌లు సాగిస్తున్న ద‌శ‌లో మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే దానిని బ‌ట్టి ఈ ఉద్య‌మ ఫ‌లితాలు ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు కూడా ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో సాగుతున్నారు. కేవ‌లం బీజేపీ మిన‌హా అన్ని పార్టీలు రోడ్డు మీదున్నాయి. అయినా కేంద్రం క‌నిక‌రించ‌డం లేదు. క‌నీసం స్పందించ‌డం లేదు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌ర్ణాట‌క‌లో ఫ‌లితాలు బీజేపీకి వ్య‌తిరేకంగా వ‌స్తే అది ఏపీకి మేలు చేస్తుంద‌నే ఆశ టీడీపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది. స్వ‌యంగా చంద్ర‌బాబు కూడా ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. క‌ర్ణాట‌క‌లో ఓట‌మి చెందుతున్న బీజేపీకి, ఆ త‌ర్వాత బుద్ధి వ‌స్తుంద‌నే ధీమాతో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌ర్వాతే ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్రం క‌ళ్లు తెరుస్తుంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించ‌డం అందులో భాగ‌మే. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో ప్ర‌భావం చూప‌గ‌ల తెలుగు ఓట‌ర్లంతా బీజేపీ ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు. టీడీపీ నేత‌లు కూడా ఈ విష‌యాన్ని బ‌హిరంగంగా చెప్పారు. క‌ర్ణాట‌క‌లో ఉన్న తెలుగువారు బీజేపీని ఓడించాల‌ని పిలుపునిచ్చారు. అంత‌ర్గ‌తంగా చంద్ర‌బాబు అనేక రూపాల్లో స‌హకారం అందిస్తున్నార‌నే వాద‌న కూడా ఉంది. ఏమ‌యినా మే 15న వెలువ‌డే క‌ర్ణాట‌క ఫ‌లితాలు దేశ రాజ‌కీయాల్లో పెనుమార్పులు తీసుకురావ‌డం ఖాయం. విప‌క్ష ఎంపీలు రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు వార్త‌ల‌న్నీ ఆ త‌ర్వాత ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారానికి కూడా అప్పుడే ముగింపు ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.


Related News

బీజేపీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సెహ్వాగ్

Spread the loveడ్యాషింగ్ ఓపెన‌ర్ గా మైదానంలోనూ,, మాట‌ల జోరుతో ట్విట్ట‌ర్ లోనూ చెల‌రేగిపోయే సెహ్వాగ్ ని వాడుకోవాల‌ని చూసినRead More

ఏపీ ప్ర‌జ‌ల‌కు నెల‌న్నర‌ ఎదురుచూపులు

Spread the loveఏడు ద‌శ‌ల్లో సాదార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలి విడ‌త ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌రుగుతుండ‌గా 91 స్థానాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *