సర్వే: మోడీకి మరో గండం

MODI
Spread the love

ఆపరేషన్ 2019కి సన్నద్ధమవుతున్న ప్రధానికి మరో షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే యూపీ, బీహార్ ఉప ఎన్నికల్లో బోల్తాపడడంతో బీజేపీ తలపట్టుకుంది. దానికి కొనసాగింపు అన్నట్టుగా ఇప్పుడు దక్షిణాదిలో కమలానికి ఏకైక ఆశాకిరణంగా ఉన్న కర్ణాటకాలో కూడా చావు దెబ్బ తప్పదని తాజా సర్వే వెల్లడించింది. దాంతో మోడీకి ముందు ముందు మరిన్ని కష్టాలు తప్పవని భావిస్తున్నారు. గుజరాత్ లో బోటాబోటి మోజార్టీతో గెలిచినప్పటికీ రాజస్తాన్, మధ్యప్రదేశ్ లో బీజేపీకి పెద్ద గండి తప్పదనే వాదన వినిపిస్తోంది. ఇక కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పాగా వేస్తే అది 2019 ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు.

మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ దాదాపు 126 సీట్లు దక్కించుకోనుందని ఆ సర్వే తెలిపింది. సిద్ధిరామయ్య సర్కార్ కి ఢోకా లేదని తేల్చింది. పైగా గతం కన్నా 9శాతం ఓట్లు, 4 సీట్లు పెరుగుతాయని చెప్పింది. 2013 ఎన్నికల్లో కర్ణాటకా ఎన్నికల ఫలితాలు అంచనా వేయడంలో విజయవంతం అయిన సీ ఫోర్స్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. 2013 లో కాంగ్రెస్‌ పార్టీకి 119 నుంచి 120సీట్లు వస్తాయని ఈ సంస్థ చెప్పగా, దాని ప్రకారమే 122 స్థానాలు దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

అయితే, ఈసారి కాంగ్రెస్‌ 126 స్థానాలు దక్కించుకుంటుందని, గతంతో పోలిస్తే నాలుగు స్థానాలు పెరుగుతాయని తెలిపింది. అంతేకాకుండా కాంగ్రెస్‌కు మొత్తం 9శాతం ఓట్లు పెరుగుతాయని తెలిపింది. ముఖ్యంగా జేడీఎస్ బలం బాగా పడిపోతుందని, ఆ మేరకు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా లాభపడతాయని తెలిపింది. బీజేపీకి గతం కన్నా 30 స్థానాలు అదనంగా వస్తాయని, 70 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. జేడీఎస్ బలం దాదాపుగా పడిపోతోందని సర్వే తెలిపింది. దాంతో ఈ సర్వే కాంగ్రెస్ శ్రేణుల్లో ధీమాని పెంచగా, కమలంలో కలవరం కలిగిస్తోంది. వాస్తవానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు దక్షిణాది మీదే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ప్రభావం చూపబోతున్న తరుణంలో కమలదళం తాడోపేడో తేల్చుకోవడానికి తగ్గట్టుగా సన్నద్దమవుతోంది.


Related News

atm-1495008331

ఏటీఎం క‌ష్టాల‌కి అస‌లు కార‌ణం అదేనా?

Spread the loveమ‌ళ్లీ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. 50 రోజులు ఆగండి..ఆ త‌ర్వాత ఉరితీసినా ఫ‌ర్వాలేద‌ని ధీమా వ్య‌క్తం చేసిన ప్ర‌ధానRead More

karnataka-elections-illustration-759

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌ర స‌ర్వే

Spread the loveక‌ర్ణాట‌క ఎన్నిక‌లు దేశ‌మంతా ఆస‌క్తిరేపుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వాసులు చాలామంది క‌ర్ణాట‌క ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్Read More

 • ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో మోడీ..!
 • క‌ర్ణాట‌క వైపు చూస్తున్న టీడీపీ
 • బీజేపీలో తిరుగుబాటు: మోడీ మీద గురి!
 • అడ్డంగా బుక్కయిన అమిత్ షా
 • సర్వే: మోడీకి మరో గండం
 • హోదా ఉద్య‌మాన్ని కొత్త‌మ‌లుపు తిప్పిన కాంగ్రెస్
 • బీజేపీ ఆశ‌ల‌కు గండి..!
 • అవిశ్వాసంతో మోడీకి ముప్పు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *