క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌ర స‌ర్వే

karnataka-elections-illustration-759
Spread the love

క‌ర్ణాట‌క ఎన్నిక‌లు దేశ‌మంతా ఆస‌క్తిరేపుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వాసులు చాలామంది క‌ర్ణాట‌క ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్ కూడా బెంగ‌ళూరులో అడుగుపెట్టారు. క‌ర్ణాట‌క‌లో తెలుగు ఓట‌ర్లంతా జేడీఎస్ కి మ‌ధ్ద‌తివ్వాల‌ని పిలుపునిచ్చారు. అదే స‌మ‌యంలో టీడీపీ త‌రుపున డిప్యూటీ సీఎంలో కేఈ కృష్ణ‌మూర్తి, చిన‌రాజ‌ప్ప స‌హా ప‌లువురు నేత‌లు ప్ర‌చారంలో ఉన్నారు. అయితే టీడీపీ నేత‌లు మాత్రం కేవ‌లం బీజేపీని ఓడించండి అని మాత్ర‌మే ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే తాజాగా ఇండియాటుడే సంస్థ ఒపీనియ‌న్ పోల్ విడుద‌ల చేసింది. మ‌రో నెల రోజుల్లో పోలింగ్ జ‌ర‌గ‌బోతున్న వేళ క‌న్న‌డిగుల మూడ్ ని ఈ ఓపీనియ‌న్ పోల్ తేట‌తెల్లం చేస్తోందిన ఆ సంస్థ చెబుతోంది. ఇండియా టుడే – కార్వీ ఇన్‌సైట్స్ ఒపీనియన్ పోల్స్‌ అంచనా ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించబోతోంది. బీజేపీ రెండో స్థానంలోనూ, జేడీఎస్ మూడో స్థానంలో నిలుస్తాయి. ఈ పోల్‌ను ఓ నెల క్రితం నిర్వహించినట్లు ఇండియా టుడే – కార్వీ తెలిపాయి.

కాంగ్రెస్‌ 90-101 శాసనసభ నియోజకవర్గాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. బీజేపీకి 78 నుంచి 86 స్థానాలు దక్కే అవకాశం ఉంది. జేడీఎస్-బీఎస్‌పీ కూటమికి 34 నుంచి 43 స్థానాలు లభించవచ్చు. జేడీఎస్-బీఎస్‌‌పీ కూటమి కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా 225 స్థానాలున్న స‌భ‌లో సంపూర్ణ మెజార్టీ ద‌క్కాలంటే 112 సీట్లు కావాలి. అవి ఎవ‌రికీ ద‌క్కే అవ‌కాశం లేద‌ని, హంగ్ సూచ‌న‌లున్నాయ‌ని చెబుతున్న ఇండియా టుడే రాబోయే స‌భ‌లో జేడీఎస్ కూట‌మి కీల‌కంగా మార‌బోతున్న‌ట్టు చెబుతుండ‌డం విశేషం. ఇక ఓట్ల లెక్క‌లు చేస్తే రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్‌కు 37 శాతం, బీజేపీకి 35 శాతం, జేడీఎస్-బీఎస్‌పీ కూటమికి 19 శాతం ఓట్లు లభించే అవకాశం కనిపిస్తోందని ఆ స‌ర్వే తేల్చింది.


Related News

atm-1495008331

ఏటీఎం క‌ష్టాల‌కి అస‌లు కార‌ణం అదేనా?

Spread the loveమ‌ళ్లీ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. 50 రోజులు ఆగండి..ఆ త‌ర్వాత ఉరితీసినా ఫ‌ర్వాలేద‌ని ధీమా వ్య‌క్తం చేసిన ప్ర‌ధానRead More

karnataka-elections-illustration-759

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌ర స‌ర్వే

Spread the loveక‌ర్ణాట‌క ఎన్నిక‌లు దేశ‌మంతా ఆస‌క్తిరేపుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వాసులు చాలామంది క‌ర్ణాట‌క ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్Read More

 • ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో మోడీ..!
 • క‌ర్ణాట‌క వైపు చూస్తున్న టీడీపీ
 • బీజేపీలో తిరుగుబాటు: మోడీ మీద గురి!
 • అడ్డంగా బుక్కయిన అమిత్ షా
 • సర్వే: మోడీకి మరో గండం
 • హోదా ఉద్య‌మాన్ని కొత్త‌మ‌లుపు తిప్పిన కాంగ్రెస్
 • బీజేపీ ఆశ‌ల‌కు గండి..!
 • అవిశ్వాసంతో మోడీకి ముప్పు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *