Main Menu

సీఎం ఇంటి ముందు రైతు ఆత్మహత్యాయత్నం

A palm
Spread the love

బడ్జెట్ కి ముందు ముఖ్యమంత్రి ఇంటి ముందు జరిగిన ఓ వ్యవహారం కలకలం రేపింది. రైతు ఆత్మహత్యాయత్నం దుమారం రేపింది. చివరకు సీఎం స్పందించాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం ముందు జరిగిన ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సదరు రైతును శాంతింపజేయడంతో కథ సుఖాతమైంది.

యూపీలోని లలిత్‌పూర్‌కి చెందిన రామ్‌రాజ్‌ ఇవాళ ఉదయం తన కుమారుడితో కలిసి సీఎం అధికారిక నివాసం ఉన్న 5- కాళిదాస్ మార్గ్‌కు వచ్చాడు. అక్కడే ఉన్న 100 అడుగుల ఎత్తైన చెట్టు ఎక్కి ఉరివేసుకునేందుకు సిద్ధపడ్డాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని అతడిని కిందికి దించేందుకు ప్రయత్నించారు. అయితే తనకున్న రూ.1.5 లక్షల రుణం మాఫీ చేస్తానని హామీ ఇస్తేనే కిందికి దిగుతానంటూ రామ్‌రాజ్ తెగేసిచెప్పాడు. దాదాపు గంటసేపు ఈ హైడ్రామా కొనసాగింది. రుణమాఫీ‌పై అధికారులు హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు రైతు చెట్టు దిగాడు.






Related News

rammadhav

మోడీకి భ‌క్తుడు రాంరాం..

Spread the loveబిజెపికి కీల‌క నేత దూర‌మ‌య్యారు. ఆయ‌న జ‌నంలో ఉండే నాయ‌కుడు కాక‌పోయినా, జ‌నం నాడి క‌నిపెట్టి, బీజేపీRead More

625352-modi-narendra-pti-092217

ముహూర్తం పెట్టేస్తున్న మోడీ

Spread the loveఎప్పుడు ఎన్నిక‌లొచ్చినా మేం సిద్దం అంటున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. కేంద్రంలో పెద్ద‌లు కూడా అదే ఆలోచ‌న‌లోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *