Main Menu

బీజేపీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సెహ్వాగ్

Spread the love

డ్యాషింగ్ ఓపెన‌ర్ గా మైదానంలోనూ,, మాట‌ల జోరుతో ట్విట్ట‌ర్ లోనూ చెల‌రేగిపోయే సెహ్వాగ్ ని వాడుకోవాల‌ని చూసిన క‌మ‌ల‌నాథుల‌కు షాక్ త‌గిలింది. ఈ మాజీ క్రికెట‌ర్ కిచ్చిన ఆఫ‌ర్ ని తిర‌స్క‌రించ‌డంతో బీజేపీ నేత‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో సెహ్వాగ్ ని బ‌రిలో దింపాల‌ని బీజేపీ భావించింది. కానీ అందుకు స‌సేమీరా అంటూ సెహ్వాగ్ నిరాక‌రించ‌డం విశేషంగా క‌నిపిస్తోంది.

సెహ్వాగ్‌ భాజపా టికెట్‌ను తిరస్కరించారని ఢిల్లీకి చెందిన ఓ సీనియర్‌ భాజపా నేత వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో సెహ్వాగ్‌ భాజపా సీటును కాదన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ ఢిల్లీ నుంచి భాజపా లోక్‌సభ అభ్యర్థిగా సెహ్వాగ్‌ కోసం ప్రతిపాదన వచ్చిందని వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన ఈ అవకాశాన్ని తిరస్కరించారని చెప్పారు.

ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలోని రోహ్ తక్ నుంచి వీరూ భాజపా అభ్యర్థిగా నిలబడతారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని సెహ్వాగ్‌ ట్విటర్‌లో ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. ‘ఇలాంటి వదంతులు కొన్ని ఎప్పటికీ మారవు. 2014లోనూ ఇలాగే ప్రచారంచేశారు. ఇప్పుడు 2019 ఎన్నికల్లోనూ చేస్తున్నారు. అప్పుడూ, ఇప్పుడూ నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు’ అని వీరు స్పష్టం చేశారు.






Related News

బీజేపీకి షాక్: ఎంపీకి చెప్పు దెబ్బ‌లు

Spread the loveబీజేపీ నేత‌ల‌కు క‌ష్టం కాలం దాప‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌డిచిన ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నేత‌లు ఎదుర్కొన్న ప‌రిస్థితిRead More

మోడీ ప‌ద‌వి ఊడుతుందా?

Spread the loveఎన్నో అశ‌ల‌తో అధికారం పీఠం ఎక్కించిన‌ప్ప‌టికీ బీజేపీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం త‌మ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ప‌నిచేయ‌లేక‌పోయింద‌న్న‌దిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *