కోర్ట్ పై కాషాయ జెండా

udaipur6_1513289436
Spread the love

మరోసారి రాజ్యాంగ పరిహాసం జరిగింది. న్యాయస్థానాల మీద నమ్మకంలేని కొందరు తమ జెండాలను ఎగరేసి చట్టాలను బేఖాతరు చేశారు. అది పెద్ద వివాదంగా పరిణమించింది. రాజస్థాన్‌లోని ఉదంపూర్ కోర్టు ఆవరణలో హిందూత్వ సంస్ధలకు చెందిన కార్యకర్తలు కాషాయ జెండాను ఎగరవేసిన సందర్భంగా ఆందోళన కారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో 30 మందికిపైగా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ కార్మికుడు మహ్మద్‌ అఫ్రాజల్‌ను లవ్‌ జిహాద్‌ పేరుతో రాజస్మండ్‌లో అతి కిరాతకంగా దాడి చేసి చంపిన శంభులాల్‌ రెగార్‌కు మద్దతుగా హిందూత్వ సంస్థలకు చెందిన కార్యకర్తలు శుక్రవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన హింసాత్మకంగా మారింది.

ఉదంపూర్ లోని కోర్టు ఆవరణ వద్ద సాయంత్రం 5 గంటల సమయంలో ఆందోళన కారులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. అందిన సమాచారం మేరకు కోర్టు ప్రవేశ మార్గం వద్ద ఆందోళన కారులు కాషాయ జెండాను ఎగురవేశారు. నిందితుడు రెగార్‌కు మరణ శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. హిందూత్వ వాద సంస్ధలకు వ్యతిరేకంగా ఆందోళన కారులు నినాదాలు చేశారు. ఆందోళనలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దీనిని వ్యతిరేకిస్తూ హిందూత్వ వాద సంస్ధలు ఉదరుపూర్‌లో నిరసన ప్రద్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో అడిషనల్‌ సూపరింటెండెంట్‌ సుధీర్‌ జోష్‌ కూడా గాయపడ్డారని పోలీసులు చెప్పారు.

ప్రస్తుతం ఉధంపూర్‌లో నెలకొన్న పరిస్థితుల ప్రాతిపదికగా మరో రెండు రోజుల పాటు నిషేధపు ఉత్తర్వులు కొనసాగిస్తామన్నారు. వీడియోలో ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఉదంపూర్‌ ఎస్‌పి తనకు హామీ ఇచ్చినట్లు రాష్ట్ర బజరంగదళ్‌ అధ్యక్షులు ఇంజ్రిత్‌ సింగ్‌తెలిపారని స్థానిక వీడియో పేర్కొంది. రేగార్‌ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను రాజస్‌మండ్‌ పోలీసులు నిలిపివేశారు. రేగార్‌ బ్యాంకు ఖాతాల్లో రూ.3 లక్షల వరకు నగదు ఉంది. రేగార్‌ భార సీతా నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాలో దేశ వ్యాప్తంగా 516 మంది నుంచి విరాళాలు వచ్చి చేరాయని, పోలీసు అధికారులు తెలిపారు.


Related News

parliament211

హోదా ఉద్య‌మాన్ని కొత్త‌మ‌లుపు తిప్పిన కాంగ్రెస్

Spread the loveకాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. బీజేపీని ఇర‌కాటంలో నెట్ట‌డానికి కదులుతోంది. అందులో భాగంగా ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం పేరుతోRead More

bjp congress

బీజేపీ ఆశ‌ల‌కు గండి..!

Spread the loveక‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు క‌ద‌న‌రంగం సిద్ద‌మవుతోంది. కానీ క‌మ‌ల‌ద‌ళానికి రానురాను క‌ష్టాలు త‌ప్ప‌వ‌నిపిస్తోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో మ‌స‌క‌బారుతున్నRead More

 • అవిశ్వాసంతో మోడీకి ముప్పు?
 • శ్రీదేవి మ‌ర‌ణానికి కార‌ణం అది కాదు…
 • నీర‌వ్ మోడీ బీజేపీకి పార్ట‌న‌ర్
 • ఆ పాటకు మద్ధతుగా సీఎం
 • సీఎం ఇంటి ముందు రైతు ఆత్మహత్యాయత్నం
 • మాజీ సీఎం కులం మార్చేసిన మోడీ
 • మోదీ మత్తులో ఉన్నప్పుడు…
 • ఆంధ్రప్రదేశ్ ఆశలపై నీళ్లు జల్లిన మోడీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *