Main Menu

మోడీకి మ‌రో షాక్, మంత్రి రాజీనామా

Spread the love

సెమీ ఫైన‌ల్స్ గా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌డానికి కొన్ని గంట‌ల‌ ముందు బీజేపీ షాక్ త‌గిలింది. ఎన్డీయే నుంచి మ‌రో పార్టీ చేజారిపోయింది దాంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది. బీహార్ రాజ‌కీయాల్లో మార్పుల‌కు సంకేతంగా భావిస్తున్నారు.
ప్రధాని మోడీకి ఇది మరో షాక్ అని భావిస్తున్నారు. ఆయన మంత్రి వర్గంలో. మాన‌వ వ‌న‌రుల శాఖ కేంద్ర స‌హాయ మంత్రిగా ఉన్న‌ ఉపేంద్ర కుష్వాహ్ మంత్రి వదవి నుంచి త‌ప్పుకున్నారు.

బీహార్‌లోని రాష్ట్రీయ లోక్ స‌మ‌తా పార్టీకి చెందిన ఆయ‌న‌.. గత కొన్నాళ్లుగా మోడీ ప్రభుత్వ వ్యవ‌హార‌శైలిపై ఆగ్రహంతో ఉన్నారు. వ‌చ్చే పార్లమెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. త‌మ పార్టీతో సీట్ల పంప‌కం స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. అయిదేళ్ల క్రితం ఎన్డీఏలో క‌లిశామ‌ని, ఎన్నో ఆశ‌ల‌తో చేరామ‌ని తెలిపారు. బీహార్ ప్రజ‌ల‌కు ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ మోడీ ప్రభుత్వం వాటిని అమ‌లు చేయ‌లేదని ఉపేంద్ర పేర్కొన్నారు. ఆర్ఎల్ఎస్పీ పార్టీకి బీహార్ ఎంపీ సీట్ల‌లో కేవ‌లం రెండు సీట్లు మాత్రమే కేటాయించారు. ఉపేంద్ర ఎన్డీఏకు గుడ్‌బై చెప్పిన వెంటనే …. ఉద‌యం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా క‌లిశారు.

దాంతో బీజేపీకిఇది ఎదురుదెబ్బ‌గా భావిస్తుండ‌గా, కాంగ్రెస్ కి బీహార్ లో మ‌రో కొత్త స్నేహితుడు దొరికినట్టేన‌ని చెబుతున్నారు.






Related News

క‌మ‌లం, కాంగ్రెస్ ప‌ని అంతే..!

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో క‌మ‌లం దాదాపుగా కుదేల‌య్యింది. నాలుగేళ్ల క్రితం కాస్త ఉత్సాహంతో క‌ళ‌క‌ళలాడిన వారి క్యాంప్ ఇప్పుడుRead More

మోడీ స‌ర్కారుకి మ‌రో ఎదురుదెబ్బ‌

Spread the loveమోడీ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలింది. తాజాగా సీబీఐలో జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *