Main Menu

సంప‌ద వేగంగా పోగుబ‌డుతోంది..!

Spread the love

భార‌త దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో అభివృద్ధి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృత‌మ‌వుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. సంప‌ద పోగుబ‌డుతున్న తీరు దానికి నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. తాజా నివేదిక అందుకు ఆధారంగా ఉంది. దేశ జనాభాలో 1 శాతం మేర వున్న శతకోటీశ్వరుల రోజువారీ ఆదాయం 2018లో రు.2,200 కోట్లకు చేరిందని ఆక్స్‌ఫామ్‌ సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయింది. దేశంలో శతకోటీశ్వరుల సంపద 39 శాతం మేర వృద్ధి చెందగా, దిగువశ్రేణి సంపన్నుల సంపద మాత్రం 3 శాతానికి మాత్రమే పరిమితమైంది.

దేశంలోని సగం జనాభా వద్ద ఉన్న సంపదకు సరిపోయినంత కేవలం తొమ్మిది మంది శతకోటీశ్వరుల వద్ద పొగుపడిందని తెలిపింది. దేశంలో సంపద తీవ్రస్థాయిలో కొద్దిమంది బడాబాబుల వద్ద కేంద్రీకృతం అవుతుందనేదానికి ఇదో పెద్ద ఉదాహరణ అని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా వున్న శతకోటీశ్వరుల ఆదాయం గత ఏడాది రోజుకు 250 కోట్ల డాలర్లకు చేరుకోగా ప్రపంచ జనాభాలో సగానికి పైగా వున్న వారి సంపద 11 శాతం మేర తగ్గిపోయినట్లు ఈ అధ్యయన నివేదిక వెల్లడించింది. దేశ జనాభాలో వున్న 10 శాతం (13.6 కోట్ల) మంది నిరుపేదలు గత దశాబ్దంన్నర కాలంగా రుణ భారంతో కొట్టుమిట్టాడుతూనే వున్నారని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. భారత్‌లో పేద, ధనిక వర్గాల మధ్య పెరుగుతున్న సంపద వైరుధ్యం అనైతికమైనదని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విన్నీ బ్యాన్యిమా ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రపంచంలో వున్న 380 కోట్ల మంది పేదల వద్ద వుండే సంపదతో సమానమైన సంపద కేవలం 26 మంది శతకోటీశ్వరుల వద్ద పోగుపడిందని ఆక్స్‌ఫామ్‌ వెల్లడించింది. అమెజాన్‌ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సంపద 11,200 కోట్ల డాలర్లకు పెరిగిందని, ఇందులో 1 శాతం మొత్తం ఇథియోపియా ఆరోగ్య బడ్జెట్‌కు సమానమని తెలిపింది. భారత్‌లో మొత్తం సంపదలో 77.4 శాతం 10 శాతం మంది చేతుల్లో కేంద్రీకృతమైందని, ఇందులో టాప్‌ 1 శాతం మంది చేతుల్లో 51.53 శాతం సంపద చిక్కుకున్నదని ఆక్స్‌ఫామ్‌ వెల్లడించింది. ఇక దిగువశ్రేణిలో వున్న 60 శాతం జనాభా వద్ద కేవలం 4.8 శాతం సంపద మాత్రమే వుందని, టాప్‌ 9 మంది శతకోటీశ్వరుల వద్ద వున్న సంపద దిగువశ్రేణిలో వున్న 50 శాతం వద్ద వున్న సంపదకు సమానమైనదని వివరించింది. భారత్‌లో తాజాగా రోజుకు 70 మంది కొత్త సంపన్నులు ఉద్భవిస్తున్నారని ఆక్స్‌ఫామ్‌ వెల్లడించింది.

విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వాలు అసమానతలు పెంచి పోషిస్తున్న వైనం తమ అధ్యయనంలో వెల్లడయిందని, బడా కార్పొరేట్‌ సంస్థలు, సంపన్నులపై పన్ను పోటు తక్కువగా వుండగా దిగువశ్రేణిలో వున్న మధ్యతరగతి, పేద వర్గాలపై మాత్రం పన్ను భారం విపరీతంగా పడుతోందని ఆక్స్‌ఫామ్‌ ఇండియా సిఇఓ అమితాబ్‌ బేహార్‌ చెప్పారు. బడా కార్పొరేట్‌ సంస్థలు, సూపర్‌ రిచ్‌ సంపన్నులు తక్కువ పన్నుభారంతో బయటపడుతుంటే లక్షలాది మంది యువతులకు గౌరవ ప్రదమైన ఉన్నత విద్య అందని మానిపండుగా మారిందని, సరైన ప్రసూతి సౌకర్యాల లేమితో అనేక మంది మహిళలు మృత్యువాత పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


Related News

బీజేపీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సెహ్వాగ్

Spread the loveడ్యాషింగ్ ఓపెన‌ర్ గా మైదానంలోనూ,, మాట‌ల జోరుతో ట్విట్ట‌ర్ లోనూ చెల‌రేగిపోయే సెహ్వాగ్ ని వాడుకోవాల‌ని చూసినRead More

ఏపీ ప్ర‌జ‌ల‌కు నెల‌న్నర‌ ఎదురుచూపులు

Spread the loveఏడు ద‌శ‌ల్లో సాదార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలి విడ‌త ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌రుగుతుండ‌గా 91 స్థానాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *