మోడీ తీరుపై రాజన్ ఆగ్రహం

raghuram-rajan-policy
Spread the love

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌…. అంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకోవడాన్ని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తప్పుబట్టారు. ఆర్థిక రంగం వృద్ధి గురించి భారత్‌ జబ్బలు చరుచుకోవాలంటే, కనీసం పదేళ్లపాటైనా ఏటా 8-10 శాతం వార్షిక వృద్ధి రేటును సాధించి చూపాలని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా వృద్ధి రేటులో భారత్‌ చైనా కంటే వెనకబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పదేపదే వృద్ధి రేటుపై వీరంగం వల్ల ప్రయోజనం లేదని రాజన్‌ చెప్పారు. భారత్‌ కావాలంటే చరిత్ర, సంస్కృతి వగైరాల గురించి గొప్పలు చెప్పుకోవచ్చు గానీ ఆర్థిక వృద్ధి గురించి మాత్రం కాదని ఆయన వ్యాఖ్యానించారు. చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే భారత్‌తో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఎగుమతులు పుంజుకుని, ప్రైవేట్‌ పెట్టుబడులు పెరిగితే తప్ప భారత జిడిపి వృద్ధి రేటు పరుగెత్తే అవకాశం లేదని రాజన్‌ స్పష్టం చేశారు. వచ్చే పదేళ్లలో మన దేశం మిడిల్‌ ఇన్‌కం దేశంగా ఎదగాలన్నా ఏటా 9-10 శాతం వృద్ధి రేటు సాధించి తీరాలన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ బాగా నీరసించి మన జిడిపి ఉరుకులు పరుగులు పెడితే తప్ప వచ్చే పదేళ్లలో మన దేశం ఆర్థిక రంగంలో చైనాను అందుకోవడం కష్టమని రాజన్‌ చెప్పారు.

ఆర్‌బిఐ గవర్నర్‌గా మూడేళ్ల పాటు పనిచేసిన రాజన్‌ ప్రభుత్వం మరోసారి ఎక్స్‌టెన్షన్‌ ఇవ్వకపోవడంతో 2016లో రిటైర్‌ అయ్యారు. గత 20 ఏళ్ల కాలంలో పదవీకాలం పొడిగింపునకు నోచుకోని ఏకైక గవర్నర్‌ రాజనే. నిజానికి గతేడాది ఏప్రిల్‌లో (ఆర్‌బిఐ గవర్నర్‌గా కొనసాగుతున్న సమయంలోనే) కూడా భారత్‌ ఆర్థిక వృద్ధికి సంబంఽధించి ప్రభుత్వం ప్రచారంలోని డొల్లతనాన్ని ఎండగడుతూ రాజన్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టించాయి. ‘‘గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటికన్ను రాజు’’లా భారత్‌ పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించడంతో అధికారపార్టీ పెద్దలు తీవ్రస్థాయిలో ఆయనపై విరుచుకుపడ్డారు. రాజన్‌ ఈ గతేడాది ఏప్రిల్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రతి త్రైమాసికంలోనూ ఆర్థిక వృద్ధి అధోముఖంగానే జారుతూ వచ్చింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 6.1 శాతం ఉండగా ఏప్రిల్‌-జూన్‌లో 5.7 శాతానికి పడిపోయింది.

ఈ ఆరునెలల్లోనూ చైనా మాత్రం 6.5 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోయింది. చైనాతో పోటీగా అభివృద్ధి చెందాలంటే కనీసం పదేళ్ల పాటు 9 శాతంపైనే వృద్ధి రేటు స్థిరంగా సాధించాలని రాజన్‌ అన్నారు. వృద్ధి రేటు దూసుకుపోవాలంటే ప్రైవేట్‌ పెట్టుబడులు పుంజుకోవడంతో పాటు ఎగుమతులు భారీగా పెరగాలని అన్నారు. అప్పటి వరకు భారత్‌ ప్రపంచదేశాలకు మన సాంస్కృతిక విజయాలు, చారిత్రక విజయాలపై గప్పాలు కొట్టవచ్చుగానీ ఆర్థిక వృద్ధిపై మాత్రం కాదని కూడా రాజన్‌ సలహా ఇచ్చారు. 1990ల్లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత అడపా దడపా 6-7-8 శాతం ఆర్థిక వృద్ధిరేటును నమోదు చేసినప్పటికీ స్థిరంగా 10 ఏళ్ల పాటు 9-10 శాతం వృద్ధి రేటు సాధిస్తే భారత్‌ మిడిల్‌ ఇన్‌కమ్‌ ఆర్థిక రంగంగా రూపుదిద్దుకుంటుందని రాజన్‌ అన్నారు.


Related News

SC Justices

దేశాన్ని కుదిపేస్తున్న ఆ రెండు కేసులు

Spread the loveసుప్రీంకోర్టులో కీలక కేసులకు బెంచీల కేటాయింపు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా జరుగుతోందా? తాజా పరిణామాల నేపథ్యంలోRead More

bhima-koregaon-latest

బరితెగించి దాడులు

Spread the loveదేశంలో ఇప్పటికే మతఘర్షణలు పెరుగుతున్నాయి. అన్ని చోట్లా వివాదాలు రాజుకుంటున్నాయి. పెద్ద సమస్యగా మారుతున్నాయి. మత సామరస్యంRead More

 • బీజేపీలో మంటరాజేసిన హార్థిక్
 • బీజేపీ ఎంపీకి జైలుశిక్ష
 • కోర్ట్ పై కాషాయ జెండా
 • మళ్లీ పప్పులో కాలేసిన మోడీ!
 • ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం
 • మోడీ ఖర్చు చూస్తే ముక్కున వేలేసుకుంటారు..
 • ప్రధానమంత్రిపై కార్పోరేట్ కంపెనీ కేసు
 • రాహుల్ సొంతగూటిలో కమల వికాసం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *