వచ్చే ఏడాదే ఎన్నిక‌లు..!

Prime minister Narendra modi with other ministers after the BJP Parliamentary board meeting at the parliament in New Delhi on Tuesday. Express Photo by Prem Nath Pandey. 10.05.2016. *** Local Caption *** Prime minister Narendra modi with other ministers after the BJP Parliamentary board meeting at the parliament in New Delhi on Tuesday.
Spread the love

జాతీయ స్థాయిలో ఈ అంచ‌నాలు పెరుగుతున్నాయి. మోడీ ప్ర‌భుత్వ దూకుడు, తాజా ప‌రిణామాలు గ‌మ‌నిస్తే అనివార్యం అనిపిస్తోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముంద‌స్తు ఖాయ‌మ‌నిపిస్తోంది. వ‌చ్చే 2018 చివ‌రిలో సాధారణ ఎన్నిక‌ల‌కు బీజేపీ సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అటు ఆర్థిక రంగంలో కూడా ప‌రిణామాలు దానినే ప్ర‌స్ఫుటం చేస్తున్నాయి.

తాజాగా సంస్క‌ర‌ణ‌ల‌కు సంబంధించి సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ మంద‌గింపు త‌గ‌ద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.సార్వత్రిక ఎన్నికలకు అటూఇటుగా ఏడాదిన్నర మాత్రమే ఉండటంతో… భారీ సంస్కరణల జోలికి వెళ్లకపోవచ్చునని, పైగా, పన్నుల తగ్గింపు వంటి వరాలు ప్రకటిస్తారని ‘బార్‌క్లేస్‌ ఇండియా’ ప్రధాన ఆర్థికవేత్త సిద్ధార్థ సన్యాల్‌ పేర్కొన్నారు. ‘‘2019 ఎన్నికల్లో మళ్లీ విజయంపై బీజేపీ దృష్టి సారించింది. ఇక సంస్కరణలపై దూకుడుగా వెళ్లే అవకాశం లేదు. ఇప్పటిదాకా అమలు చేసిన సంస్కరణల ఫలాలు, అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపైనే మోదీ దృష్టి సారిస్తారని భావిస్తున్నాం’’ అని సిద్ధార్థ సన్యాల్‌ తెలిపారు.

పెద్దనోట్ల రద్దుతో సంపాదించిన రాజకీయ ప్రయోజనాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుందనే అంచనాలున్నాయి. రాజకీయ పార్టీలకు విరాళాలపై కఠినమైన నియమావళిని రూపొందిస్తారని కూడా తెలుస్తోంది. బినామీ ఆస్తులపైనా ఉక్కు పాదం మోపుతారు. ఇక… విదేశాల్లో డబ్బు దాచుకున్న భారతీయుల సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది. ప్రభుత్వ సేవలను కూడా మోదీ మరింత మెరుగుపరుస్తారు’’ అని సన్యాల్‌ పేర్కొన్నారు. వెరసి… వచ్చే ఎన్నికల దాకా ప్రధాని మోడీ మధ్య తరగతి, సామాన్యులు నచ్చే, మెచ్చే చర్యలపై ఫోకస్‌ పెడతారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈనేప‌థ్యంలో ముంద‌స్తు మేఘాలు క‌మ్ముకుంటే రాజ‌కీయాలు కూడా మ‌రింత వేడెక్క‌డం ఖాయం.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *