Main Menu

బీజేపీ ఎంపీకి షాకిచ్చిన ప్రకాష్ రాజ్

Spread the love

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరో అడుగు ముందుకేశారు. ఈసారి నేరుగా బీజేపీ నేతతో తలపడ్డారు. ఎంపీకి లీగల్ నోటీసు జారీ చేసి షాకిచ్చారు. తన మీద చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించడంతో బీజేపీ ఎంపీ ఇప్పుడు చిక్కుల్లో పడినట్టు కనిపిస్తోంది.

మైసూరు బీజేపీ ఎంపీ ప్రతా్‌పసింహకు ప్రకాష్ రాజ్ న్యాయవాదులు లీగల్‌ నోటీసు పంపారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు పదిరోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని లేదంటే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని సింహాకు పంపిన నోటీ్‌సలో ప్రకాశ్‌రాజ్‌ హెచ్చరించారు. పరువునష్టం దావా వేసే ఆలోచనా ఉందన్నారు.

గౌరీ లంకేశ్‌ హత్యపై తాను చేసిన వాఖ్యలకు కౌంటర్‌గా బీజేపీ ఎంపీ సింహ ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో చాలా అభ్యంతరక కామెంట్స్‌ పోస్ట్‌ చేశారన్నారు. కాగా, దీనిపై స్పందిస్తూ.. ప్రకాశ్‌ రాజ్‌ రాజకీయాల్లోకి వస్తే ప్రజాబలం ఏమిటో తెలుస్తుందని కామెంట్ చేశారు. దాంతో ఇప్పుడీ వ్యవహారం కోర్టు మెట్టులెక్కుతున్న సమయంలో ఆసక్తిగా మారింది.






Related News

మోడీ మళ్లీ గెలుస్తారా?: పీకే ఏమన్నారంటే!

Spread the loveదేశంలో ఎన్నికల ఫలితాలపై సర్వే బ్రుందాలకు ప్రాధాన్యత పెరగింది. గడిచిన ఎన్నికల్లో మోడీ విజయానికి ప్రశాంత్ కిషోర్Read More

ఫండ్స్ అన్నీ బీజేపీకే

Spread the loveప్రూడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌.. దేశంలోనే అత్యంత సంపన్న ఎలక్టోరల్‌ ట్రస్టు ఇది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వివిధRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *