Main Menu

ప్రధానమంత్రిపై కార్పోరేట్ కంపెనీ కేసు

Spread the love

పెట్టుబడుల ఆకర్షణలో భారత్‌ దూసుకుపోతోందని, పరిశ్రమలు తరలివస్తున్నాయని పదే పదే చెబుతున్న మోడీ సర్కార్‌కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ నిస్సాన్‌ మోటార్స్‌ ఏకంగా భారత ప్రధానిపైనే కేసు దాఖలు చేసింది. ఆ కంపెనీకి రావాల్సిన ప్రోత్సాహకాల చెల్లింపులో తమిళనాడు ప్రభుత్వం విఫలం కావడం, ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో చర్యకు దిగినట్లు నిస్సాన్‌ తెలిపింది. ఈ నేపథ్యంలోనే భారత్‌పై ఏకంగా 770 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 5వేల కోట్ల)కు దావా వేసింది. దీనికి సంబంధించి గతేడాదే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కూడా లీగల్‌ నోటీసులు జారీ చేసినట్లు పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఓ వ్యక్తి పేర్కొన్నారని రాయిటర్స్‌ ఒక కథనంలో వెల్లడించింది. ఈ కేసులో విచారణ చేపట్టాలని కోరుతూ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ను నిస్సాన్‌ ఆశ్రయించింది. ఇలాంటివి భారత్‌పై ఇప్పటికే ఈ తరహా 20 కేసులు పైగా ఉన్నాయని సమాచారం. ప్రపంచంలో మరే దేశంంపై ఇన్ని కేసులు లేవని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటు కోసం 2008 ఒప్పందంలో భాగంగా తమకు తమిళనాడు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయలను చెల్లించాలని నిస్సాన్‌ కోరింది. వాస్తవానికి 2015లో ఈ మొత్తం ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించింది. ఈ విషయమై సంస్థ చైర్మన్‌ కార్లోస్‌ ఘోసన్‌ గతేడాది ప్రధానీ మోడీకి లేఖ రాసినా ఫలితం లేదని ఆ కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని కోరినట్లు నిస్సాన్‌ తెలిపింది. కాగా గతేడాది జులైలో మోడీకి లీగల్‌ నోటీసులు జారీ కాగా, బకాయిలు తప్పకుండా చెల్లిస్తామని దీన్ని లీగల్‌ కేసు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు సమాచారం. కానీ నిస్సాన్‌ మాత్రం అందుకు అంగీకరించకుండా ఈ వ్యవహారంలో మద్యవర్తిని నియమించుకోవాలని భారత్‌కు ఆల్టిమేటం జారీ చేయడం గమనార్హం. డిసెంబర్‌ రెండో వారంలో దీనికి సంబంధించిన విచారణ జరగనుందని తెలుస్తోంది. బకాయిల విషయంలో కంపెనీల మధ్య ఎలాంటి వివక్ష చూపించడం లేదని తమిళనాడు ఉన్నతాధికారి ఒక్కరు పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు.


Related News

అమాంతంగా పెరిగిన మోడీ ఆస్తులు

Spread the loveప్ర‌ధాన‌మంత్రి మోడీ ఆస్తులు అమాంతంగా పెరిగాయి. ఓవైపు నోట్ల‌ర‌ద్దు త‌ర్వాత 35ల‌క్ష‌ల మంది ఉపాధి కోల్పోవాల్సి వ‌చ్చింద‌నిRead More

జ‌గ‌న్ స‌ల‌హాదారు సంచ‌ల‌న నిర్ణ‌యం

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌కీయంగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *