నీర‌వ్ మోడీ బీజేపీకి పార్ట‌న‌ర్

niramodi-k5lG--621x414@LiveMint
Spread the love

పంజాబ్ నేష‌నల్ బ్యాంక్ ని ముంచి, దేశం నుంచి ద‌ర్జాగా పారిపోయిన నీర‌వ్ మోడీ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. 2011లో మొద‌ల‌యిన లెట‌ర్ ఆఫ్ అండ‌ర్ స్టాండింగ్స్ వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ నేత‌ల పాత్ర ఉంద‌ని బీజేపీ ఆరోపిస్తుండ‌గా, మెజార్టీ ఎల్వోయూలు 2017లోనే జారీ అయిన‌ట్టు సీబీఐ నివేదిక నిర్ధారించింది. దాంతో బీజేపీ నేత‌ల పాత్ర కూడా పెద్ద‌దేన‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దాని నుంచి త‌ప్పించుకోవ‌డానికే అన్న‌ట్టుగా నీర‌వ్ మోడీ , ఆయ‌న బంధువుల ఇళ్ల‌పై దాడుల‌తో ఈడీ హ‌డావిడి చేస్తోంది.

అయితే తాజాగా బీజేపీ మిత్ర‌ప‌క్షం శివ‌సేన ఘాటు ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఆపార్టీ అధికార పత్రిక సామ్నాలో బీజేపీ వ్య‌వ‌హారం మీద తీవ్రంగా స్పందించింది. 11400 కోట్లుగా చెబుతున్న పీఎన్బీ కుంభ‌కోణంలో ప్ర‌ధాన సూత్ర‌ధారి నీర‌వ్ మోడీ అధికార బీజేపీకి భాగ‌స్వామి అంటూ శివ‌సేన ఆరోపించింది. అనేక ఎన్నిక‌ల్లో బీజేపీకి నీర‌వ్ నుంచి భారీగా చందాలు వ‌చ్చాయ‌ని వివ‌రించింది. అంతేగాకుండా జ‌న‌వ‌రి 1 నాడు దేశం విడిచిపోయిన వ్య‌క్తి ఏకంగా ప్ర‌ధాన‌మంత్రితో ఫోటోల‌కు దిగ‌డం దేనికి సంకేత‌మ‌ని ప్ర‌శ్నించింది. ఇదేనా అవినీతిర‌హిత భార‌తం అని నిల‌దీసింది. అతి పెద్ద బ్యాంకింగ్ కుంభ‌కోణంగా చెబుతున్న నీవ‌ర్ వ్య‌వ‌హారంలో బీజేపీకి పార్ట‌న‌ర్ షిప్ ఉంద‌ని విమ‌ర్శించింది.

అవినీతిని పార‌ద్రోలుతామ‌ని చెప్పి, ఎఫ్ఐఆర్ ఉన్న వ్య‌క్తితో క‌లిసి ఫోటోల‌కు దిగిన వ్య‌వ‌హారంపై మోడీ స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీసింది. దేశంలో అవినీతికేసుల్లో లాలూ ప్ర‌సాద్ వంటి వారిని జైల్లో పెడుతూ విజ‌య్ మ‌ల్యా, నీర‌వ్ మోడీల‌ను దర్జాగా దేశం దాటించ‌డానికి స‌హ‌క‌రించిందెవ‌రో చెప్పాల‌న్నారు. చిన్న చిన్న రుణాలు తీర్చ‌లేక రైతులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతుంటే బ‌డాబాబులు బాహాటంగా బ్యాంకులు దోచేసి విదేశాల్లో కులాశాగా ఉండ‌డ‌మే అవినీతిర‌హిత‌మా అని పేర్కొన్నారు. కేవ‌లం ప్ర‌చారంతోనే మోడీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను మోస‌గిస్తోంద‌ని ఆరోపించారు.


Related News

parliament211

హోదా ఉద్య‌మాన్ని కొత్త‌మ‌లుపు తిప్పిన కాంగ్రెస్

Spread the loveకాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. బీజేపీని ఇర‌కాటంలో నెట్ట‌డానికి కదులుతోంది. అందులో భాగంగా ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం పేరుతోRead More

bjp congress

బీజేపీ ఆశ‌ల‌కు గండి..!

Spread the loveక‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు క‌ద‌న‌రంగం సిద్ద‌మవుతోంది. కానీ క‌మ‌ల‌ద‌ళానికి రానురాను క‌ష్టాలు త‌ప్ప‌వ‌నిపిస్తోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో మ‌స‌క‌బారుతున్నRead More

 • అవిశ్వాసంతో మోడీకి ముప్పు?
 • శ్రీదేవి మ‌ర‌ణానికి కార‌ణం అది కాదు…
 • నీర‌వ్ మోడీ బీజేపీకి పార్ట‌న‌ర్
 • ఆ పాటకు మద్ధతుగా సీఎం
 • సీఎం ఇంటి ముందు రైతు ఆత్మహత్యాయత్నం
 • మాజీ సీఎం కులం మార్చేసిన మోడీ
 • మోదీ మత్తులో ఉన్నప్పుడు…
 • ఆంధ్రప్రదేశ్ ఆశలపై నీళ్లు జల్లిన మోడీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *