కొత్త అధ్య‌క్షుడు ఖ‌రారు

kovind
Spread the love

భార‌తదేశ 14వ రాష్ట్రప‌తి ఖ‌రార‌య్యారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీయే అభ్య‌ర్ధి రామ్‌నాథ్ కోవింద్ విజ‌యం సాధించారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు పూర్త‌య్యింది. అధికారికంగా రామ్ నాథ్ కోవింద్ ఎన్నిక‌యిన‌ట్టు ప్ర‌క‌టించారు. ఎన్డీయే అభ్య‌ర్థిగా బ‌రిలో దిగిన కోవింద్ 65.6 శాతం ఓట్ల‌తో యూపీఏ అభ్య‌ర్ధి మీరాకుమార్‌పై విజ‌యం సాధించారు. మొత్తంగా ఎన్డీయే అభ్య‌ర్థికి 2,930 ఓట్లు సాధించారు. వాటి విలువ 7,02,044 గా ఉంది. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీల అభ్య‌ర్థిగా పోటీ చేసిన మీరా కుమార్ కి 1,844 కి ఓట్లు దక్కాయి. వాటి విలువ‌ 3,67,314 గా లెక్కించారు. దాంతో రామ్‌నాథ్ కోవింద్ 3,35,330 ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించారు.

రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ ఎన్నికైనట్టు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అనూప్‌ మిశ్రా మీడియాకు అధికారికంగా వెల్లడించారు. ఈమేర‌కు కోవింద్‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ , కేంద్ర మంత్రులు , మ‌మ‌తాబెన‌ర్జీ శుభాకాంక్ష‌లు తెలిపారు. కాగా ఈనెల 24తో రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీకాలం ముగియ‌నున్న విష‌యం తెలిసిన‌దే.ఈనేప‌ధ్యంలో రామ్‌నాథ్ కోవింద్ 25న భార‌తదేశ 14వ రాష్ట్రప‌తిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.


Related News

page-41

మోడీకి సినిమా చూపిస్తున్నారు..

Spread the love260Sharesమెర్సల్..ఓ సాధారణ సినిమా. అందులోనూ ప్రాంతీయ భాషలో తీసిన సినిమా. ఆ సినిమాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగాRead More

kejriwal

ఆమ్ ఆద్మీ కూడా ఆ చెట్టు కొమ్మేనా?

Spread the love6Sharesఇప్పటికే అన్నా హజారేని చూశాం…కిరణ్ బేడీని చూశాం..రామ్ దేవ్ బాబాని, నితీష్ కుమార్ ని కూడా చూశాం.Read More

 • దేశభవిష్యత్ గుజరాత్ చేతిలో..
 • తప్పు అంగీకరించిన కమల్ హాసన్
 • ఆస్తుల్లో కమలం పార్టీకే అగ్రస్థానం
 • బీజేపీని మట్టికరిపిస్తాం…
 • బీజేపీ కోలుకుంటుందా?
 • అమిత్ షా నో చెప్పేశారు..
 • బీజేపీకి షాకిచ్చిన ఆర్ఎస్ఎస్
 • కమలం జయకేతనం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *