Main Menu

అవిశ్వాసంతో మోడీకి ముప్పు?

Spread the love

వాస్త‌వానికి బీజేపీ నాయ‌త్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం మీద అవిశ్వాసం పెడితే పెద్ద‌గా స‌మ‌స్య ఉండ‌ద‌ని, వీగిపోతుంద‌ని పైకి క‌నిపిస్తున్న దృశ్యం. కానీ వాస్త‌వం వేరుగా క‌నిపిస్తోంది. రానురాను కొడ‌గ‌ట్టుకుపోతున్న బీజేపీ ప్ర‌భావం గ‌మ‌నిస్తే లోక్ స‌భ బ‌లాబ‌లాల్లో ప‌లుమార్పులు వ‌చ్చాయి. తాజా యూపీ ఎన్నిక‌ల త‌ర్వాత మోడీ మీద విశ్వాసం స‌న్న‌గిల్లుతోంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఇలాంటి త‌రుణంలో వైసీపీ అవిశ్వాసం ప్ర‌తిపాదిస్తే, దానికి కాంగ్రెస్, టీడీపీ, లెఫ్ట్ స‌హా ఇత‌ర ప‌క్షాలు మ‌ద్ధ‌తు ప‌లికుతామ‌ని ప్ర‌క‌టించాయి. దాంతో ఓటింగ్ వ‌ర‌కూ వెళితే మాత్రం అనూహ్య ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే బీజేపీకి ఒక్క ఓటు తేడాతో అధికారం కోల్పోయిన అనుభ‌వం ఉంది. దాంతో పార్ల‌మెంట్ వ్య‌వ‌హారాలు ఒక్క‌సారిగా వేడెక్క‌డం ఖాయం.

2014 ఎన్నిక‌ల్లో బీజేపీ ఒంట‌రిగా 282 సీట్లు గెలుచుకుంది. మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి బ‌లం 320కిపైగా సాధించింది. కానీ తాజాగా మిత్ర‌ప‌క్షాలు చేజారిపోయాయి. శివ‌సేన‌, అకాలీద‌ళ్ స‌ర‌స‌న టీడీపీ చేరింది. ఈ మూడు పార్టీలు దూర‌మ‌యిన త‌ర్వాత మిగిలిన చిన్న చిన్న ప‌క్షాలు ఏమేర‌కు నిల‌బ‌డ‌తాయ‌న్న‌ది సందేహ‌మే., దాంతో బీజేపీ సొంత బ‌లం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ బ‌లం ప్ర‌స్తుతం 272 మాత్ర‌మే. సాధార‌ణ ఎన్నిక‌ల తరువాత జరిగిన 16 లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల్లొ BJP మరియు దాని మిత్రపక్షాలు నిల‌బెట్టుకున్న‌ది కేవలం 3 సీట్లు మాత్ర‌మే. అందులో మోడి ఖాళి చేసిన వడోదర,రెండు షదోల్ (మధ్యప్రదేశ్), మూడు గోపినాథ్ ముండే మరణంతో జరిగిన బీడ్ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి.

అదే స‌మ‌యంలో బీజేపీ ఆరు సిట్టింగ్ సీట్లు కోల్పోయింది. రాట్లం(మధ్యప్రదేశ్), గురుదాస్ పూర్ (పంజాబ్), అజ్మేర్(రాజస్థాన్), ఆల్వర్(రాజస్థాన్), గోరక్ పూర్,ఫూల్ పూర్ వంటి స్థానాలున్నాయి. మ‌రో ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరగవలసి ఉంది. మొత్తంగా 2014లో 282 స్థానాలు గెలిచిన బీజేపీ ప్రస్తుత బలం 272. ఖాళీగా ఉన్న స్థానాలను తీసివేయగా కావలసిన మెజారిటి 269 కన్నా మూడు సీట్లు మాత్ర‌మే అధికం.ఇందులో తిరుబాటు చేసిన శత్రుఘ్న సిన్హా, సస్పెండు కాబడ్డ కీర్తి అజాద్ లను తొలగిస్తే బీజేపీ సొంత‌ బలం కనీస మెజారిటీ కన్నా కేవలం ఒకే ఒక్క సీట్ కావ‌డం విశేషం. దాంతో అవిశ్వాస తీర్మానానికి కేంద్రం అనుమ‌తిస్తుందా అన్న సందేహం వ్య‌క్తం అవుతోంది. అనుమ‌తించిన ప‌క్షంలో చివ‌ర‌కు ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు జ‌రిగినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే ఆగ్ర‌హంగా ఉన్న అద్వానీ వ‌ర్గం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌న్న‌ది సందేహ‌మే. దాంతో మోడీ-షా ద్వ‌యానికి పెద్ద ప‌రీక్ష కాబోతోంద‌న‌డంలో సందేహం లేదు. అందుకే అవిశ్వాసం అంగీక‌రించ‌ర‌నే వాద‌న ఉంది. ఏం జ‌రుగుతుందో చూడాలి.


Related News

బీజేపీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సెహ్వాగ్

Spread the loveడ్యాషింగ్ ఓపెన‌ర్ గా మైదానంలోనూ,, మాట‌ల జోరుతో ట్విట్ట‌ర్ లోనూ చెల‌రేగిపోయే సెహ్వాగ్ ని వాడుకోవాల‌ని చూసినRead More

ఏపీ ప్ర‌జ‌ల‌కు నెల‌న్నర‌ ఎదురుచూపులు

Spread the loveఏడు ద‌శ‌ల్లో సాదార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలి విడ‌త ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌రుగుతుండ‌గా 91 స్థానాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *