Main Menu

మోడీ ప‌ద‌వి ఊడుతుందా?

Spread the love

ఎన్నో అశ‌ల‌తో అధికారం పీఠం ఎక్కించిన‌ప్ప‌టికీ బీజేపీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం త‌మ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ప‌నిచేయ‌లేక‌పోయింద‌న్న‌ది మెజార్టీ ప్ర‌జ‌ల అభిప్రాయం. కార్పోరేట్ మీడియా వ‌ర్గాల్లో ఎలాంటి ప్ర‌చారం సాగిన‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో ఓట‌ర్ల‌లో మోడీ ప్ర‌భ పూర్తిగా మ‌స‌గ‌బారింది. దాంతో అధికారం నిల‌బెట్టుకోవ‌డం ఇప్పుడు క‌మ‌ల‌ద‌ళానికి కాస్త క‌ష్ట‌మైన ప‌నిగా క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే అస్త్ర‌శ‌స్త్రాలు సిద్ధం చేసుకుని సాధార‌ణ స‌మ‌రంలో దూకింది. కానీ తొలి ద‌శ‌లో జ‌రిగిన పార్ల‌మెంట్ సీట్ల‌ను ప‌రిశీలిస్తే బీజేపీ సింగిల్ డిజిట్ కే ప‌రిమితం కావ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలున్నాయి.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే 2014నాటి ప‌రిస్థితి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. అయినా అత్తెస‌రు మెజార్టీతో మ‌ళ్లీ మోడీ వ‌స్తార‌న్న‌ది కాషాయ శ్రేణుల ఆశ‌. కానీ వాస్త‌వం వేరుగా ఉంది. ముఖ్యంగా కీల‌క రాష్ట్రం యూపీలో గ‌డిచిన ఎన్నిక‌ల్లో 80 సీట్ల‌కు గానూ ఏకంగా 71 స్థానాల‌లో బీజేపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఇక మిత్ర‌ప‌క్షం అప్నాద‌ళ్ మ‌రో రెండు సీట్లు కైవ‌సం చేసుకోగా కాంగ్రెస్ 2, ఎస్పీ 5 సీట్ల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. కానీ ప్ర‌స్తుతం యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూట‌మి పెను ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌బోతోంది. బీజేపీని కార్న‌ర్ చేసే అవ‌కాశాలు స్ప‌ష్టంగా ఉన్నాయి. మోడీ, యోగీ స‌ర్కార్ల ప‌ట్ల జ‌నంలో ఉన్న అసంతృప్తితో గ‌రిష్టంగా 20 సీట్ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌స్తోంద‌ని అంతా అంచ‌నాలు వేస్తున్నారు. దాంతో బీజేపీకే క‌నీసంగా 50 సీట్ల‌కు క‌న్నం ప‌డుతుంది.

ఇక గుజ‌రాత్ 26, రాజ‌స్తాన్ 25, మ‌ధ్య‌ప్ర‌దేశ్ 28 సీట్ల‌కు గాను గ‌డిచిన ఎన్నిక‌ల్లో బీజేపీకి ద‌క్కిన సీట్లు 77 సీట్లు. కాంగ్రెస్ కి కేవ‌లం ఎంపీలో మాత్ర‌మే రెండు ఎంపీ సీట్లు ద‌క్క‌గా, మిగిలిన రెండు రాష్ట్రాల‌ను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి వాటిలో స‌గం కూడా ద‌క్కించుకుంటే గొప్పే అన్న‌ట్టుగా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇటీవ‌లే రాజ‌స్తాన్, ఎంపీల‌లో బీజేపీ నుంచి కాంగ్రెస్ చేతుల్లోకి అధికారం మారింది. బీజేపీ త‌ర‌హా హిందూత్వ విధానాలు కాంగ్రెస్ భుజానికెత్తుకుంది. త‌ద్వారా బీజేపీ ఓట్ బ్యాంక్ కి గండిప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దాంతో ఈ సీట్ల‌లో క‌నిష్టంగా 30 స్థానాలు కోల్పోవ‌డం ఖాయంగా చెప్ప‌వ‌చ్చు.

ఇక ఇత‌ర రాష్ట్రాల‌లో అసోంలో గెలిచిన 7 సీట్ల‌లో క‌నీసం రెండు కోల్పోయే సూచ‌న‌లున్నాయి. బీహార్ లో 22 సీట్లు బీజేపీకి ద‌క్క‌గా ఈసారి అందులో స్వ‌ల్పంగా త‌గ్గ‌డం అనివార్యంగా క‌నిపిస్తోంది. ఢిల్లీలో 7 సీట్ల‌ను ద‌క్కించుకున్న ఈసారి స‌గం కూడా నిల‌బెట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయం ఉంది. హ‌ర్యానాలో 7, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో 4 ద‌క్కించుకుగా ఈసారి రాష్ట్ర ప్ర‌భుత్వాల మీద ఉన్న వ్య‌తిరేక‌త కూడా ప‌నిచేస్తే అందులో స‌గానికే ప‌రిమితం కావాల్సి ఉంటుంది. జార్ఖండ్ లో 14 స్థానాల‌కు గానూ 12 సీట్లు ద‌క్కించుకున్న బీజేపీ ఈసారి స‌గానికే ప‌రిమితం కావాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. క‌ర్ణాట‌క‌లో ఇటీవ‌లి ప‌రిణామాలు ముఖ్యంగా జేడీఎస్, కాంగ్రెస్ కూట‌మి కార‌ణంగా గ‌తంలో బీజేపీ గెలిచిన 17 సీట్లు ఈసారి నిల‌బెట్టుకోవ‌డం గ‌గ‌న‌మే. మ‌హారాష్ట్ర‌లో గెలిచిన 23 సీట్ల‌కు గానూ ఈసారి బీజేపీ క‌నీసంగా 5 స్థానాలు కోల్పోయే దిశ‌లో ఉంది. ఇక శివ‌సేన‌కు ద‌క్కిన 18 స్థానాలు కూడా ఈసారి త‌గ్గుద‌ల ఖాయ‌మ‌ని చెబుతున్నారు. పంజాబ్ లో ద‌క్కిన 3, ఏపీలో గెలిచిన రెండు, ఉత్త‌రాఖండ్ , చ‌త్తీస్ ఘ‌డ్ త‌మిళ‌నాడు కేర‌ళ‌లో గెలిచిన సీట్ల‌లో ప‌లు స్థానాలు ఈసారి క‌మ‌లానికి మాయం అవుతున్న‌ట్టుగా చెప్ప‌వ‌చ్చు. దాంతో ఈ రాష్ట్రాల‌లో మొత్తంగా బీజేపీకి మ‌రో 40 సీట్ల వ‌ర‌కూ త‌గ్గుద‌ల ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక బీజేపీ ఆశ పెట్టుకున్న బెంగాల్ , ఒడిశా రాష్ట్రాల‌లో అత్య‌ధికంగా పెరిగినా బెంగాల్ 10, ఒడిశా 10 మాత్ర‌మే అవ‌కాశం ఉంది. త‌ద్వారా బీజేపీకి ఒంట‌రిగా 120 సీట్లు కోల్పోతుండ‌గా అద‌నంగా 20 మాత్ర‌మే ద‌క్కుతాయ‌ని అంచ‌నాలున్నాయి. త‌ద్వారా 180 సీట్ల‌కు ప‌రిమితం కావాల్సి ఉంటుంది. అదే స‌మ‌యంలో ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు కూడా భారీగా గండి అనివార్యం. పంజాబ్, మ‌హారాష్ట్ర‌, ఈశాన్య రాష్ట్రాలు, బీహార్, త‌మిళ‌నాడులో కూడా మోడీ మిత్రుల‌కు ఓటర్ల‌లో మంట త‌ప్ప‌డం లేదు. దాంతో ఎన్డీయే బ‌లం భారీగా త‌గ్గ‌బోతోంది. ఇక ఏపీలో జ‌గ‌న్, తెలంగాణాలో కేసీఆర్ కి అద‌నంగా 30 సీట్ల వ‌ర‌కూ వ‌చ్చిన‌ప్ప‌టికీ మోడీని ఖ‌చ్చితంగా బ‌ల‌ప‌రుస్తార‌నే విశ్వాసం లేదు. దాంతో ఈసారి మోడీకి మూఢిన‌ట్టేన‌నే అభిప్రాయం ఓట‌ర్ల‌లో బ‌లంగా వినిపిస్తోంది.


Related News

బీజేపీకి షాక్: ఎంపీకి చెప్పు దెబ్బ‌లు

Spread the loveబీజేపీ నేత‌ల‌కు క‌ష్టం కాలం దాప‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌డిచిన ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నేత‌లు ఎదుర్కొన్న ప‌రిస్థితిRead More

మోడీ ప‌ద‌వి ఊడుతుందా?

Spread the loveఎన్నో అశ‌ల‌తో అధికారం పీఠం ఎక్కించిన‌ప్ప‌టికీ బీజేపీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం త‌మ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ప‌నిచేయ‌లేక‌పోయింద‌న్న‌దిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *