Main Menu

మళ్లీ పప్పులో కాలేసిన మోడీ!

Spread the love

ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ విన్యాసాలు ఇప్పటికే చాలామార్లు అభాసుపాలయ్యాయి. గతంలో చెన్నైలో వరదలు వచ్చినప్పుడు పర్యటనల సందర్భంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మార్పింగ్ ఫోటోలు పంపించి వివాదాల్లో ఇరుక్కుంది. ఇక ఇప్పుడు తాజాగా నరేంద్ర మోడీ సొంత వెబ్ సైట్ ఓ అర్థసత్యం ప్రసారం చేయడం , దానిని కాపీ చేసి బీజేపీ నేతలంతా విస్త్రుతంగా ప్రచారం చేయడం, చివరకు జాతీయ చానెళ్లు కూడా అదే నిజమని నమ్మేసి దేశమంతా కథనాలు రాసేయడం ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. మీడియా ఎంత ఏకాక్షిలా ఉందో అర్థమవుతోంది. మోడీ అండ్ కో ఉద్దేశపూర్వకంగానే అలాంటి ప్రసారం చేసినప్పటికీ, దానిని నిర్థారించుకోకుండా దేశమంతా మీడియా చానెళ్లన్నీ ప్రసారం చేసేయడం విస్మయకరంగా మారింది.

తాజాగా అహ్మదాబాద్‌లో సబర్మతీ నది నుంచి మెహసానాలోని ధరాయ్‌ డ్యామ్‌ వరకు సముద్ర విమానంలో ప్రయాణించారు. దానిని ఆయన వెబ్‌సైట్‌ ‘డబ్లూడబ్లూడబ్లూ. నరేంద్రమోదీ డాట్‌ ఇన్’ ఆకాశానికి ఎత్తింది. ‘భారత్‌లోని మొట్టమొదటి సముద్ర విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి ప్రయాణికుడు ప్రధాన మంత్రి మోదీ’ అంటూ శీర్శిక పెట్టింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధికార వెబ్‌సైటే కాకుండా పలువురు బీజీపీ నాయకులు కూడా గుడ్డిగా ఈ హెడ్డింగ్‌ను కాపీ చేసి ట్వీట్లు చేశారు. అంతకంటే ఘోరంగా, ఎలాంటి విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించకుండా పలు జాతీయ, ప్రాంతీయ పత్రికలతోపాటు పలు టీవీ ఛానళ్లు ‘భారత్‌ తొలి సముద్ర విమానంలో ప్రయాణించిన తొలి ప్రయాణికుడు ప్రధాని మోదీ’ అంటూ వార్తలను ప్రసారం చేశాయి.

కానీ వాస్తవం వేరుగా ఉంది. మోడీ వెబ్ సైట్ గానీ, ఆయన చెప్పినదానిని యధావిధిగా జనాలకు చేరవేసిన మీడియా గానీ చెప్పిన దానికి భిన్నంగా ఉంది. సముద్ర విమానాల సర్వీసులు భారత్‌లో 2010 సంవత్సరంలోనే ప్రారంభమయ్యాయి. అండమాన్, నికోబార్‌లోని ప్రభుత్వ యంత్రాంగం 2010లో ‘జల్‌ హంస’ పేరిట ఈ సీ ప్లేన్‌ సర్వీసులను ప్రారంభించింది. ప్రఫుల్‌ పటేల్‌ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైన ఈ సర్వీసులు గిట్టుబాటు లేక అనతి కాలంలోనే నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ప్రఫుల్‌ పటేల్‌ ట్వీట్‌ ద్వారా మీడియాకు ధ్రువీకరించారు. 2013లో కేరళ పర్యాటక శాఖ, ఊమెన్‌ చాండీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీప్లేన్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.

అప్పట్లో మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ పథకం నిలిచిపోయింది. తాజాగా ‘స్పైస్‌జెట్‌’ సంస్థ కొడైయిక్‌ క్వెస్ట్‌ సీప్లేన్‌ను ముంబై తీసుకొచ్చి గిర్‌గామ్‌ ప్రాంతంలో డిసెంబర్‌ 9వ తేదీన ట్రయల్స్‌ నిర్వహించింది. ఈ ట్రయల్స్‌లో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కారి, అశోక గజపతి రాజు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ‘ఎన్‌ 181 కేక్యూ’ నెంబర్‌ కలిగిన ఈ సీప్లేన్‌లో వారిరువురు కేంద్ర మంత్రులు ప్రయాణించారు. ఇప్పుడు సరిగ్గా అదే సీప్లేన్‌లో మంగళవారం నరేంద్ర మోదీ ప్రయాణించారు. దాంతో ఇప్పుడు మోడీ మొదటి వ్యక్తి అని ఆయన అధికారిక సంస్థ ప్రకటించడం విడ్డూరంగా మారింది. విస్మయకరంగా తయారయ్యింది. ‘భారత్‌లోని మొట్టమొదటి సీప్లేన్‌ నుంచి దిగిన మొట్టమొదటి ప్రయాణికుడు ప్రధాని మోదీ’ అనడంలో అర్థం ఉందా? అందుకనే ఆయన్ని ఆయన పార్టీ సహచరుడు ఎల్‌కే అద్వానీ ‘మోదీ మంచి ఈవెంట్స్‌ మేనేజర్‌’ అని వ్యాఖ్యానించిన విషయం యధార్థమని స్పష్టమవుతోంది. ప్రధానమంత్రి స్థాయిలో ఇంత పచ్చిగా అబద్ధాలు వల్లించడం మాత్రం దేశంలో ఇదే ప్రధమమని చెప్పవచ్చు.


Related News

మోడీకి మూఢిన‌ట్టేనా..!

Spread the loveప్ర‌ధానమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలుత డిల్లీలో ఖంగుతిన్నారు. రాజ‌ధాని రాష్ట్రంలో ఓట‌మి పాల‌యినా పెద్ద‌గా ఖాత‌రుRead More

మోడీకి మ‌రో షాక్, మంత్రి రాజీనామా

Spread the loveసెమీ ఫైన‌ల్స్ గా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌డానికి కొన్ని గంట‌ల‌ ముందు బీజేపీ షాక్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *