Main Menu

మోడీకి మూఢిన‌ట్టేనా..!

Spread the love

ప్ర‌ధానమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలుత డిల్లీలో ఖంగుతిన్నారు. రాజ‌ధాని రాష్ట్రంలో ఓట‌మి పాల‌యినా పెద్ద‌గా ఖాత‌రు చేయాల్సిన అవ‌స‌రం రాలేదు. ఆ త‌ర్వాత బీహార్ లో భారీ ఆశ‌లు నీరుగారినా ఇబ్బంది ప‌డ‌లేదు. ఉప ఎన్నిక‌ల ఓట‌ములు కూడా క‌ష్టంగా క‌నిపించ‌లేదు. క‌ర్ణాట‌క‌లో ఖంగుతిన్న‌ప్ప‌టికీ ఖాత‌రు చేయ‌లేదు. కానీ సెమీఫైన‌ల్స్ గా భావించిన చోట క‌మ‌లం కుదేలుకావ‌డంతో ఆ క్యాంపులో క‌ల‌క‌లం రేపుతోంది. ముఖ్యంగా మోడీ కి 2014 ఎన్నిక‌ల‌కు ముందు శుభారంభం ప‌లికిన రాష్ట్రాల్లో ఈసారి ఓట‌మి పాలుకావ‌డం క‌ల‌వ‌ర‌పాటుకి గురిచేస్తోంది.

అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. బీజేపీకి సింపుల్ మెజార్టీతో అధికార పీఠం అందించిన ఉత్త‌రాది గాలి వ్య‌తిరేకంగా వీస్తుండ‌డ‌మే దానికి కార‌ణం. మందిరం వివాదం మ‌ళ్లీ రాజుకున్న వేళ‌, మోడీ తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు తిరిగి ప్ర‌సారం నిర్వ‌హించిన వేళ రాజ‌స్తాన్ కోట కూలిపోవ‌డం, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఆశ‌లు నీరుగారిపోవ‌డం, చ‌త్తీస్ ఘ‌డ్ లో చేతులెత్తేయాల్సి రావ‌డం, తెలంగాణాలో బ‌లహీన‌ప‌డ‌డం అన్నీ క‌లిసి బీజేపీ లో ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. మోడీకి మూఢింద‌నే సంకేతాలనిస్తున్నాయి.

దాంతో మ‌రో నాలుగైదు నెల‌ల్లో సాధార‌ణ ఎన్నిక‌ల ముంగిట తాజా ఫ‌లితాల‌తో క‌మ‌లం క‌ల‌లు పండేలా లేవ‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు, సాధార‌ణ ఎన్నిక‌ల‌కు పొంత‌న లేక‌పోయిన‌ప్ప‌టికీ మోడీ విధానాల వైఫ‌ల్య ప్ర‌భావం మ‌రింత తీవ్రంగా ఉంటుంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా ఉంది. ప్ర‌ధానంగా నోట్ల‌ర‌ద్దు, జీఎస్టీ స‌హా ప‌లు విధానాల‌తో పాటు సుప్రీంకోర్ట్ నుంచి సీబీఐ వ‌ర‌కూ, ఆర్బీఐ నుంచి ఈడీ వ‌ర‌కూ అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను దిగ‌జారుస్తున్న తీరుతో కాషాయ నేత‌ల‌కు కంటిమీద కునుకులేకుండా చేసే ప‌రిస్థితి వ‌స్తుందనే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. మొత్తంగా ఇప్ప‌టికే ద‌క్షిణాదిలో పూర్తిగా బీజేపీ కి బీట‌లు వార‌గా, తాజాగా ఉత్త‌రాదిన కూడా ఉసూరుమ‌నిపించేలా ఉన్న వాతావ‌ర‌ణం వారిని ఉలికిపాటుకి గురిచేస్తోంది. దేశ‌రాజ‌కీయాల్లో మార్పులు ఖాయ‌మ‌న్న సంకేతాల‌నిస్తోంది.


Related News

క‌మ‌లం, కాంగ్రెస్ ప‌ని అంతే..!

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో క‌మ‌లం దాదాపుగా కుదేల‌య్యింది. నాలుగేళ్ల క్రితం కాస్త ఉత్సాహంతో క‌ళ‌క‌ళలాడిన వారి క్యాంప్ ఇప్పుడుRead More

మోడీ స‌ర్కారుకి మ‌రో ఎదురుదెబ్బ‌

Spread the loveమోడీ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలింది. తాజాగా సీబీఐలో జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *