Main Menu

మోడీ స‌ర్కారుకి మ‌రో ఎదురుదెబ్బ‌

Spread the love

మోడీ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలింది. తాజాగా సీబీఐలో జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. అలోక్‌ వర్మను బలవంతంగా సెలవుపై పంపలేరని, ఆయననే సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ వర్సెస్‌ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరిస్తూ.. కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది.

సీబీఐ అనేది స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థ అని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నందున రాజకీయ పక్షాలు జోక్యం చేసుకోకూడదని న్యాయస్థానం తీర్పును వెలువరించింది. అలోక్‌ వర్మను సెలవులపై పంపిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొటివేస్తూ… సీబీఐ డైరెక్టర్‌పై చర్యలు తీసుకునేముందు అపాయింట్‌మెంట్‌ కమిటీని సంప్రదించి ఉండాల్సిందని పేర్కొంది. అలోక్‌ వర్మపై ఆరోపణలు ఉన్నందున హైపవర్‌ కమిటీ విచారణ పూర్తి అయ్యే వరకు ఆయన ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీం పేర్కొంది.

కమిటీ విచారణ పూర్తి అయ్యి నివేదికను అందించిన తరువాతనే నిర్ణయాలు తీసుకుంటారని ధర్మాసనం తీర్పులో పొందుపరిచింది. అలోక్‌వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రం వారిని అక్టోబర్‌ 23న సెలవుపై పంపంది. ఈ తీర్పు మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.






Related News

బీజేపీ ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన సెహ్వాగ్

Spread the loveడ్యాషింగ్ ఓపెన‌ర్ గా మైదానంలోనూ,, మాట‌ల జోరుతో ట్విట్ట‌ర్ లోనూ చెల‌రేగిపోయే సెహ్వాగ్ ని వాడుకోవాల‌ని చూసినRead More

ఏపీ ప్ర‌జ‌ల‌కు నెల‌న్నర‌ ఎదురుచూపులు

Spread the loveఏడు ద‌శ‌ల్లో సాదార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. తొలి విడ‌త ఎన్నిక‌లు ఏప్రిల్ 11న జ‌రుగుతుండ‌గా 91 స్థానాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *