Main Menu

మోడీ ఖర్చు చూస్తే ముక్కున వేలేసుకుంటారు..

Spread the love

కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొందరికి కొన్ని అవసరంగా మారతాయి. మరికొన్ని ఆడంబరాలు తోడవుతాయి. ప్రధాని మోడీని చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. అందులో ఆయనకు ప్రచార ప్రీతి బాగా ఎక్కువ. ఎన్నికల ముందు త్రీడీలలో హామీలు గుప్పించి ఆ తర్వాత కేవలం మీడియా ప్రచారంతో మభ్యపెట్టడానికి ఆయన సిద్ధపడుతున్నారనే వాదన ఉంది. దానికి తగ్గట్టుగానే తాజాగా బయటపడిన లెక్కలున్నాయి. ఆర్టీఐలో కేంద్రం అధికారికంగా చెప్పిన లెక్కలు గమనిస్తే మనం ముక్కున వేలేసుకోక తప్పదు.

మోడీ ఏం చేసినా అది ప్రచారార్భాటంతోనే ఉంటుంది. అందుకే ప్రజావసరాల కన్నా పబ్లిసిటీకి ప్రాధాన్యతనిస్తారనే పేరుంది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సి ఉంది. కానీ మోడీ సర్కారు తొలుత కేవలం జిల్లాకో 50 కోట్లు చొప్పున 350 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుంది. అదే సమయంలో మోడీ ప్రభుత్వం ప్రచారం కోసం చేసిన ఖర్చు లెక్కిస్తే గుండెగుభిల్లు మంటుంది. హుద్ హుద్ తుఫాన్ సమయంలో విశాఖ వచ్చి వెయ్యి కోట్లు ఇస్తానని ప్రకటించి 450 కోట్లతో సరిపెట్టిన ప్రధాని తన ప్రచారం విషయంలో మాత్రం రాజీపడలేదు. ఈ ప్రచారం కోసం గడిచిన మూడున్నరేళ్లో సుమారు 1300 రోజుల వ్యవధిలో మోడీ ప్రభుత్వం ఏకంగా 3,754 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. అంతకుముందు మన్మోహన్ సింగ్ సర్కారు పదేళ్లలో 930 కోట్లు ఖర్చు చేసింది. అంటే పదేళ్ల వ్యయం కన్నా మూడున్నరేళ్లలో మూడు రెట్లు అదనంగా ప్రచారానికి ఖర్చు చేయడం మోడీ పనితీరుకి నిదర్శనంగా ఉంది.

నోయిడా కి చెందిన ఆర్టీఐ కార్యకర్త రణవీర్ అడిగిన సమాచారానికి ప్రభుత్వం సమర్పించిన సమాధానంలో ఈ లెక్కలున్నాయి. దాని ప్రకారం 37,54,06,23,616 రూపాయల వ్యయం జరిగినట్టు తెలిపారు. చివరకు ప్రమాదకరంగా మారిన కాలుష్య నివారణకు 56.8 కోట్లు మాత్రమే కేటాయించిన మోడీ అనేక శాఖలకు కేటాయించిన బడ్జెట్ కన్నా ఎక్కువగా ప్రచారానికి వినియోగించడం విస్మయం కలిగిస్తోంది. అందులో ప్రింట్ మీడియాకు 1,698 కోట్లు, అవుట్ డోర్ ప్రచారానికి అంటే హోర్డింగ్స్, ఇతర రకాల ప్రచారాలకు 399 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా లెక్కలు మాత్రం వివరంగా లేవు. ఆన్ లైన్ కేంద్రంగా వివిధ రకాల ప్రచార జిమ్మిక్కులతో సోషల్ మీడియాని వాడుకుంటున్న మోడీ టీమ్ కి చేస్తున్న ఖర్చు మాత్రం స్పష్టంగా ఇవ్వకపోవడం విశేషం. కేవలం ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమానికే 146 కోట్లతో ప్రచారం నిర్వహించారంటే ఈ కండూతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


Related News

అమాంతంగా పెరిగిన మోడీ ఆస్తులు

Spread the loveప్ర‌ధాన‌మంత్రి మోడీ ఆస్తులు అమాంతంగా పెరిగాయి. ఓవైపు నోట్ల‌ర‌ద్దు త‌ర్వాత 35ల‌క్ష‌ల మంది ఉపాధి కోల్పోవాల్సి వ‌చ్చింద‌నిRead More

జ‌గ‌న్ స‌ల‌హాదారు సంచ‌ల‌న నిర్ణ‌యం

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌కీయంగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *