మాజీ సీఎం కులం మార్చేసిన మోడీ

Faridabad - Prime Minister Narendra Modi  during a workshop for the newly elected MPs at Suraj Kund in Faridabad on Saturday, 28 June 2014. (Photo by ARIJIT SEN . DNA)
Spread the love

మోడీ వ్యతిరేకులు అనేక ప్రచారాాలు చేస్తుంటారు. మిస్టర్ ఫేకూ అని కూడా పిలుస్తుంటారు. ఆయన తీరుని అనేక రకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో ఎండగడుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆయనతో పాటు అనుచరులు కూడా పలుమార్లు ఫేక్ ఫోటోలు వినియోగించి పక్కాగా దొరికిపోయారు. ఇక తాజాగా పార్లమెంట్ సాక్షిగా మోడీ చేసిన ప్రకటనలో అర్థసత్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మోడీ అబద్ధాల ప్రభావం ఆఖరికి అత్యున్నత చట్ట సభకు చేరిందనే వాదన వినిపిస్తోంది.

ఏపీకి బడ్జెట్ కేటాయింపులపై ఎంపీల నిరసనకు సమాధానంగా మోడీ పార్లమెంట్ లో ప్రసంగిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ మీద ఆయన దుమ్మెత్తిపోశారు. ఏపీ డిమాండ్స్ కోసం నిలదీస్తుంటే ఆయన మాత్రం కర్ణాటకా ఎన్నికల ప్రచార సభను తలపించేలా ఉపన్యసించారు. పూర్తిగా కాంగ్రెస్ మీద దాడికి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే దళిత ముఖ్యమంత్రి అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారంటూ పేర్కొన్నారు. దాంతోనే తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకొచ్చారని పేర్కొన్నారు.
696b2af0-dbd9-40a0-b1b1-6c53cca9d4ce

అయితే అసలు వాస్తవం ఏమంటే సదరు అంజయ్య దళితుడు కాదు. ఆయన పక్కా రెడ్డి. పూర్తిపేరు కూడా రామక్రుష్ణారెడ్డి. ఆయన తండ్రి పేరు పాపిరెడ్డి. తనయుడి పేరు శ్రీనివాసరెడ్డి. అయినా మోడీ మాత్రం అంజయ్యను దళితుడిగా పేర్కొని అందరినీ ఆశ్చర్యపరిచారు. అదే సమయంలో అంజయ్య వాస్తవానికి సామాన్య కూలీగా జీవితం ప్రారంభించిన నిరుపేద నాయకుడు. అయినా సామాజికంగా ఎస్సీ కాదు. అయినప్పటికీ మోడీ ఆయన్ని దళితుడిగా ఉచ్చరించడం ప్రధాని అవివేకాన్ని చాటుతోందంంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.

అంతేగాకుండా కాంగ్రెస్ హయంలోనే దళితుడైన దామోదరం సంజీవయ్య సీఎంగా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ఉపముఖ్యమంత్రి దామెదరం రాజనర్సింహకు ఆయన తండ్రి. అయితే మోడీ మాత్రం సంజీవయ్యకు, అంజయ్యకు తేడా తెలియక చట్టసభల్లో అబద్ధం చెప్పారా..లేక అవగాహనా లోపమా అన్నది మాత్రం విశేషంగా మారింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *