Main Menu

బాప్-భేటా అవినీతికి ముగింపు త‌ప్ప‌దు..!

Spread the love

ఏపీలో అత్యంత చ‌ర్చ‌నీయాంశంగా మారిన న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిగా సాగింది. అనుకున్న‌ట్టుగానే మోడీ చంద్ర‌బాబు మీద విమర్శ‌లు గుప్పించారు. ఎన్టీఆర్ పేరు చెప్పి, సీనియారిటీని గుర్తు చేసి, చివ‌ర‌కు నారా లోకేశ్ ని ప్ర‌స్తావించి బాబు మీద గురిపెట్ట‌డం విశేషంగా మారింది. మోడీ గుంటూరు స‌భ‌లో చేసిన ప్ర‌సంగం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీ నిర్వ‌హించిన స‌భ‌లో మోడీ ఉప‌న్యాసం పెను దుమారం రేపేలా ఉంది.

ఈ సంద‌ర్భంగా మోడీ ఉప‌న్యాసంలో నారా లోకేశ్ ను ప‌దే ప‌దే ప్ర‌స్తావించ‌డం ఇప్పుడు పెద్ద ఆస‌క్తిక‌ర అంశం అవుతోంది. చంద్ర‌బాబు పేరు ఎత్త‌కుండానే సీనియారిటీ అంటూ సెటైర్లు, నిధుల దుర్వినియోగం , అభివృద్ధి నిధులు ప‌క్క‌దారి ప‌ట్టించ‌డం వంటి అంశాల‌ను మోడీ ప్ర‌స్తావించారు. శ్రీమాన్ నాయుడు అంటూనే చంద్ర‌బాబు మీద దుమ్మెత్తిపోశారు. ఏపీ బీజేపీ శ్రేణుల‌కు మోడీ ప్ర‌సంగం ఉత్సాహాన్నిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అనేక ఆటంకాల మ‌ధ్య నిర్వ‌హించిన ఆయ‌న నేరుగా చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడి మీద చేసిన విమ‌ర్శ‌లు విని ఏపీ క‌మ‌ల‌నాధులు ఊపిరిపీల్చుకునే అవ‌కాశం ద‌క్కుతుంది.

యూట‌ర్న్ సీఎం అంటూ, లోకేశ్ కోస‌మే స‌న్ రైజ్ అంటూ ప‌లు ర‌కాల కామెంట్స్ తో మోడీ త‌న‌దైన శైలిలో మాట‌ల దాడి చేశారు. నిధుల వినియోగంలో లెక్క‌లు అడిగితే చంద్ర‌బాబుకి స‌మ‌స్య ఏమిట‌ని నిల‌దీశారు. ప్ర‌జాధ‌నంతో పార్టీ కార్య‌క్ర‌మాలు , ఢిల్లీలో ఫోటోలు తీయించుకోవ‌డాన్ని నిల‌దీశారు. ఈ నేప‌థ్యంలో మోడీ ప్ర‌సంగంలో నారా లోకేశ్ అంశం ప‌దే ప‌దే ప్ర‌స్తావించ‌డం వెనుక ప్ర‌త్యేక కార‌ణాల‌పై ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబు అనుచ‌రులు సీఎం ర‌మేష్, సుజ‌నా చౌద‌రి వంటి వారి మీద గురిపెట్టిన కేంద్రం త్వ‌ర‌లో బాబు త‌న‌యుడి మీద దృష్టి పెట్టే అవ‌కాశం ఉంద‌న‌డానికి ఈ ప్ర‌సంగం ఈ సంకేతంగా కొంద‌రు భావిస్తున్నారు. ఏమ‌యినా ఈ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిదాయ‌కం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంలో బాప్-భేటీ స‌ర్కార్ అంటూ అరే బాబూగారు అంటూ కామెంట్ చేయ‌డం విశేషంగా చెప్ప‌వ‌చ్చు. ఏపీ సంస్కృతిని, సంప్ర‌దాయాల‌ను చంద్ర‌బాబు కాల‌రాస్తున్నార‌ని మండిప‌డ్డ తీరు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా చెప్ప‌వ‌చ్చు.






Related News

బీజేపీకి షాక్: ఎంపీకి చెప్పు దెబ్బ‌లు

Spread the loveబీజేపీ నేత‌ల‌కు క‌ష్టం కాలం దాప‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌డిచిన ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నేత‌లు ఎదుర్కొన్న ప‌రిస్థితిRead More

మోడీ ప‌ద‌వి ఊడుతుందా?

Spread the loveఎన్నో అశ‌ల‌తో అధికారం పీఠం ఎక్కించిన‌ప్ప‌టికీ బీజేపీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం త‌మ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ప‌నిచేయ‌లేక‌పోయింద‌న్న‌దిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *