Main Menu

మీటూ ఎఫెక్ట్ – ఆయ‌న ఉద్యోగం ఫ‌ట్

Spread the love

మీటూ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. లైంగిక వేధింపుల‌కు నిర‌స‌న‌గా మొద‌ల‌యిన ఉద్య‌మం తీవ్ర దుమారం రేపుతోంది. దాంతో ఈ వ్య‌వ‌హారంలో తాజాగా ఓ సీనియ‌ర్ ఉద్యోగం కోల్పోవాల్సి రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మీడియాలోని ప్రముఖలపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు ఆఖ‌రికి ఎడిట‌ర్ సైతం ఉద్యోగం వ‌దిలి వెళ్ళాల్సి వ‌చ్చింది.

గ‌తంలో ప‌లు సంస్థ‌ల్లో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో త‌మ‌ను లైంగికంగా వేధించారంటూ ప్ర‌స్తుత ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ రెసిడెంట్ ఎడిటర్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దాంతో కేఆర్ శ్రీనివాస్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. వ‌రుస‌గా పెరిగిన ఒత్తిడి కార‌ణంగా ఆయ‌న ఉద్యోగం వ‌దులుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. తమకు అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడని, తన కోరిక తీర్చాలంటూ ఎక్కడపడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడని ప‌లువురు మ‌హిళా జర్న‌లిస్టులు ఆయ‌న మీద‌ ఆరోపణలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో ‘టైమ్స్‌ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్ విభాగానికి ఎడిటర్‌గా పనిచేస్తున్న కేఆర్ శ్రీనివాస్ రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆయ‌న రాజీనామా చేసిన మాట వాస్తవమేనని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఎడిటోరియల్ డైరెక్టర్ జైదీప్ బోస్ కూడా ధృవీకరించారు. తనను టార్గెట్ చేస్తున్నందు వల్లే రాజీనామా చేసినట్లు లేఖలో ఆయన వివరించారు. దాంతో ఈ వ్య‌వ‌హారం మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.






Related News

మోడీకి మూఢిన‌ట్టేనా..!

Spread the loveప్ర‌ధానమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలుత డిల్లీలో ఖంగుతిన్నారు. రాజ‌ధాని రాష్ట్రంలో ఓట‌మి పాల‌యినా పెద్ద‌గా ఖాత‌రుRead More

మోడీకి మ‌రో షాక్, మంత్రి రాజీనామా

Spread the loveసెమీ ఫైన‌ల్స్ గా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌డానికి కొన్ని గంట‌ల‌ ముందు బీజేపీ షాక్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *