ఆ సీఎం ఆస్తి ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు…

manik-sarkar_650x400_51449925757
Spread the love

దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు. గడిచని ముప్పై ఏళ్లుగా ఆయన పార్టీ త్రిపురని పాలిస్తోంది. అలాంటి సీఎం అతి సాదారణంగా జీవించడం చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. అయినా మాణిక్ తీరు మాత్రం మారడం లేదు. ఇక తాజాగా ఆయన మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనుండగా ఆయన ధన్‌పూర్‌ స్థానానికి సీపీఎం తరఫున రంగంలో దిగుతున్నారు.

ఈ సందర్భంగా దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో ఆయన ఆస్తిపాస్తుల వివరాలు చూసి అంతా నోరెళ్లబెట్టారు. ఏకంగా ఓ ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సర్కార్‌ పొందుపరిచిన విషయాలు విస్మయకరంగా ఉన్నాయి. వీటి ప్రకారం..మాణిక్‌ సర్కార్‌ వద్ద ఉన్న నగదు రూ.1,520 కాగా, బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు రూ.2,410 మాత్రమే. ఈయనకు వ్యవసాయ భూములు గానీ ఇళ్ల స్థలాలు గానీ లేవు. ముఖ్యమంత్రికి ప్రభుత్వం నుంచి అందే వేతనం మొత్తాన్ని పార్టీకి విరాళంగా ఇస్తూ పార్టీ నుంచి జీవనభృతిగా నెలకు రూ.5వేలు మాత్రం పొందుతున్నారు.

కాగా, మాణిక్‌ సర్కారు సతీమణి పాంచాలీ భట్టాచార్య కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగిని. ఈమె వద్ద నగదు రూ.20,140కాగా రెండు బ్యాంకు ఖాతాల్లో కలిపి దాదాపు రూ.2 లక్షల నగదు ఉంది. వీటితోపాటు రూ.9.25 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. 20 గ్రాముల బంగారు నగలు ఉన్నాయి. ఈమె పేరుతో రూ.21 లక్షల విలువైన 888.35 చదరపు అడుగుల ఇంటి స్థలంలో రూ.15 లక్షల విలువైన ఇల్లు ఉంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *