Main Menu

మ‌ళ్లీ త‌న మార్క్ చూపించిన మంచు మ‌నోజ్

Spread the love

మంచు కుటుంబం ఎప్పుడూ సూటిగానే ఉంటుంది. మంచు మో్హన్ బాబు విష‌యంలో ఇది స్ప‌ష్టం అయ్యింది. ఆయ‌న ముక్కుసూటిత‌నం కార‌ణంగా రాజ‌కీయంగా ఎక్కువ‌కాలం మ‌నుగ‌డ సాగించ‌లేక‌పోయిన‌ట్టు ప‌లువురు చెబుతుంటారు. అయితే రాజ‌కీయాల మీద ఆస‌క్తిగా ఉన్న మంచు వారి వార‌సుడు మ‌నోజ్ కూడా మ‌రింత స్ట్రయిట్ గా సాగుతుండ‌డం విశేషంగా చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న సామాజిక అంశాల విష‌యంలో మంచు మ‌నోజ్ తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

తాజాగా శ‌బ‌రిమ‌ల వివాదం నేప‌థ్యంలో మంచు మ‌నోజ్ కామెంట్స్ మ‌రోసారి అత‌ని ప‌రిణ‌తిని చాటుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం మిర్యాలగూడ‌లో ప్ర‌ణ‌య్ హ‌త్య విష‌యంలో కూడా మ‌నోజ్ స్పందించిన తీరు కొంద‌రికి గిట్ట‌క‌పోయినా, ఆయ‌న మాత్రం త‌న మ‌నుసులో అభిప్రాయాన్ని చాటిచెప్ప‌డం ద్వారా ప‌లువురిని మెప్పించారు. ఇప్పుడు మ‌రోసారి త‌న మార్క్ కామెంట్స్ తో మంచు మ‌నోజ్ పరిప‌క్వ‌త ప్ర‌ద‌ర్శించారు.

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వటంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై నటుడు మంచు మనోజ్‌ స్పందించారు. ఓ అభిమాని సేవ్‌ శబరిమల క్యాంపెయిన్‌పై ఇప్పటికైనా నోరు విప్పండి అంటూ మనోజ్‌ ను ట్యాగ్‌చేస్తూ ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌పై స్పందించిన మనోజ్‌.. ‘మనం పేదలకు నీరు, ఆహారం, చదువు లాంటి కనీస అవసరాల తీర్చడం పై ముందుగా బాధపడాలి. మనకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఆయన, తన సమస్యలను తానే పరిష్కరించుకోగలడని కూడా నమ్మాలి. మానవత్వం కోసం పోరాడండి’ అంటూ కామెంట్ చేశాడు మనోజ్‌. దాంతో మ‌నోజ్ తీరుని ప‌లువురు స‌మ‌ర్థిస్తున్నారు. సూటిగా సామాజిక స‌మ‌స్య‌లే కీల‌కం అంటూ ఆయ‌న చెప్పిన తీరు ప‌లువురిని మెప్పించింది. మ‌తాన్ని రాజ‌కీయాల‌కు వాడుకోవ‌డం, కోర్టు తీర్పుల‌పై వివాదాలు రాజేయ‌డం కాకుండా స‌మ‌స్య‌ల విష‌యంలో శ్ర‌ద్ధ పెట్టాల‌ని చెప్పిన మ‌నోజ్ ట్వీట్ సంచ‌ల‌నం అవుతోంది.






Related News

మోడీకి మూఢిన‌ట్టేనా..!

Spread the loveప్ర‌ధానమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలుత డిల్లీలో ఖంగుతిన్నారు. రాజ‌ధాని రాష్ట్రంలో ఓట‌మి పాల‌యినా పెద్ద‌గా ఖాత‌రుRead More

మోడీకి మ‌రో షాక్, మంత్రి రాజీనామా

Spread the loveసెమీ ఫైన‌ల్స్ గా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌డానికి కొన్ని గంట‌ల‌ ముందు బీజేపీ షాక్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *