కమలం జయకేతనం

bjp
Spread the love

బీజేపీ విజయం సాధించింది. మహారాష్ట్రలో అధికార పార్టీగా ఉన్న బీజేపీ గ్రామసీమల్లో మంచి ఫలితాలు సాధించింది. భారీ విజయం దక్కించుకుంది. పంచాయితీల్లో పాగా వేసింది. పదే పదే కాలుదువ్వుతున్న మిత్రపక్షం శివసేనను మూడో స్థానానికి నెట్టి, ప్రతిపక్ష కాంగ్రెస్ ను మూడో వంతు సీట్లకే పరిమితం చేసి అఖండ మెజార్టీ సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపికి అంతగా పట్టులేదన్న అపోహలను చెల్లాచెదురు చేస్తూ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

మహారాష్ట్ర పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ పోస్టులకు నేరుగా ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. పార్టీ గుర్తులపై పోటీ చేయడానికి వీలులేనప్పటికీ రాజకీయ పార్టీల అలయెన్స్‌తోనే అభ్యర్థులు బరిలోకి దిగారు. మొత్తం 3.489 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, 2,974 గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో బీజేపీ నామినీలు 1,457 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ 301తో రెండో స్థానంలో, శివసేన 222తో మూడో స్థానంలోనూ, ఎన్సీపీ 194 స్థానాలతో నాలుగో స్థానంలోనూ నిలిచాయి.

ఈ ఫలితాలు బీజేపీకి ఊరటనిస్తాయని చెప్పవచ్చు. త్వరలో గుజరాత్ ఎన్నికల నేపథ్యంలొనూ, తాజాగా మహారాష్ట్రంలో రైతు ఉద్యమాల ప్రభావం ఉంటుందన్న అంచనాల నేపథ్యంలోనూ బీజేపీకి ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా ఉండడం కమలనాథులకు తోడ్పడుతుంది.


Related News

kejriwal

ఆమ్ ఆద్మీ కూడా ఆ చెట్టు కొమ్మేనా?

Spread the loveఇప్పటికే అన్నా హజారేని చూశాం…కిరణ్ బేడీని చూశాం..రామ్ దేవ్ బాబాని, నితీష్ కుమార్ ని కూడా చూశాం.Read More

modi66_660_071213110644

దేశభవిష్యత్ గుజరాత్ చేతిలో..

Spread the loveదేశంలో ముందస్తు ఎన్నికల సన్నాహాలు సాగుతున్నాయి. అన్ని పార్టీలు దానికి సిద్ధపడుతున్నాయి. అధికార , ప్రతిపక్షాల్లో కదలికలుRead More

 • తప్పు అంగీకరించిన కమల్ హాసన్
 • ఆస్తుల్లో కమలం పార్టీకే అగ్రస్థానం
 • బీజేపీని మట్టికరిపిస్తాం…
 • బీజేపీ కోలుకుంటుందా?
 • అమిత్ షా నో చెప్పేశారు..
 • బీజేపీకి షాకిచ్చిన ఆర్ఎస్ఎస్
 • కమలం జయకేతనం
 • అమిత్ షా పరువు కాపాడుతుందా
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *