Main Menu

కేజ్రీవాల్ సంచ‌ల‌న నిర్ణ‌యం, సీఎంలంద‌రికీ స‌వాల్

Spread the love

దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశంలో ఢిల్లీ ప్ర‌భుత్వం ఓ అడుగు వేసింది. కేజ్రీవాల్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం మిగిలిన సీఎంలంద‌రికీ స‌వాల్ గా మారుతోంది. ముఖ్యంగా ఉద్యోగ వ‌ర్గానికి చెందిన కీల‌క స‌మ‌స్య‌గా మారిన కాంట్రిబ్యూట‌ర్ పెన్ష‌న్ విధానంలో ఆప్ ప్ర‌భుత్వం వేసిన ముంద‌డుగు ప‌లువురిని ముప్పు తిప్ప‌లు పెట్టేలా ఉంది.

సీపీఎస్ విధానం ర‌ద్దు చేయాలంటూ ప‌లువురు చాలాకాలంగా ఉద్య‌మం సాగిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ, ఏపీలో చంద్ర‌బాబు వంటి స‌ర్కార్ల‌కు వ్య‌తిరేకంగా ఈ ఆందోళ‌న‌లు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేజ్రీవాల్ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ఢిల్లీలో సీపీఎస్ ర‌ద్ద‌యితే దాని తాకిడి ఏపీ స‌హా అన్ని రాష్ట్రాల‌పై ప‌డుతుంది.

ఢిల్లీలో నూతన పెన్షన్‌ విధానం(సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని చేసిన ప్ర‌క‌ట‌న ఆస‌క్తిగా మారింది. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు చేప‌ట్టిన‌ నిరసన ప్రదర్శనలో సీఎం కేజ్రీవాల్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. పాత పెన్షన్‌ విధానం అమలుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌ లేకపోవడం బాధాకరం అన్నారు. అందుకే ఢిల్లీలో సీపీఎస్‌ రద్దు చేశానన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఏపీ ప్రభుత్వాలతో మాట్లాడి ఆయా రాష్ట్రాల్లో సీపీఎస్‌ రద్దుకు కృషి చేస్తానన్నారు.

దాంతో ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుంద‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఇప్ప‌టికే సీపీఎస్ విష‌యంలో త‌న ప్ర‌మేయం లేద‌ని, కేంద్ర‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. కానీ కేజ్రీవాల్ మాత్రం ఏపీ ప్ర‌భుత్వంతో మాట్లాడి ర‌ద్దు చేయిస్తాన‌ని చెప్ప‌డంతో చంద్ర‌బాబు స్పంద‌న ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. తాము అధికారంలోకి వ‌స్తే సీపీఎస్ కి సెల‌వు ప్ర‌క‌టిస్తామ‌ని జ‌గ‌న్, ప‌వ‌న్ కూడా ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దాంతో ఇదో రాజకీయ అంశంగా మారబోతోంది.






Related News

మోడీకి మూఢిన‌ట్టేనా..!

Spread the loveప్ర‌ధానమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలుత డిల్లీలో ఖంగుతిన్నారు. రాజ‌ధాని రాష్ట్రంలో ఓట‌మి పాల‌యినా పెద్ద‌గా ఖాత‌రుRead More

మోడీకి మ‌రో షాక్, మంత్రి రాజీనామా

Spread the loveసెమీ ఫైన‌ల్స్ గా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌డానికి కొన్ని గంట‌ల‌ ముందు బీజేపీ షాక్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *