మోడీ క్యాబినెట్ లోకి 14మంది, ఏపీ నుంచి ఆయనే

modi
Spread the love

కేంద్ర కేబినెట్‌లో కొత్తగా 14మందికి చోటు దక్కనుంది. నితిన్‌ గడ్కరీకి రహదారులు, నౌకాయానంతో పాటు పౌర విమానయాన శాఖ, ప్రకాష్‌ జవదేకర్‌కు రైల్వేశాఖ , సురేష్‌ ప్రభుకు రక్షణ శాఖ కి ఖరారయినట్టు సమాచారం. ఇక రవిశంకర్‌ ప్రసాద్‌, అశోక్‌ గజపతిరాజు శాఖల మార్పు ఖాయంగా మారింది. తెలుగు రాష్ట్రాల నుంచి రేసులో మురళీధర్‌రావు, రాంమాధవ్‌, కిషన్‌రెడ్డి, హరిబాబు, గోకరాజు గంగరాజు వంటి పేర్లు వినిపించాయి. కానీ చివరకు ఏపీ నుంచి కంభంపాటి హరిబాబుకి బెర్త్ ఖాయం అయినట్టు కనిపిస్తోంది. హరిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ బయలుదేరడం దానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇక తెలంగాణా నుంచి మురళీధర్ రావు కి ఖాయం అయ్యింది. ధర్మేంద్రప్రధాన్‌, పీయూష్‌ గోయల్‌, మనోజ్‌సిన్హాలకు పదోన్నతి లభిస్తుందని చెబుతున్నారు. వినయ్‌ సహస్రబుద్దే, ఓం మాధూర్‌, భూపేంద్ర యాదవ్‌లకు ఛాన్స్‌ ఉండవచ్చు. ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌, సత్యపాల్‌ సింగ్‌, ప్రహ్లాద్‌ జోషిలకు ఛాన్స్‌ ఖాయం అయ్యింది. జేడీయూ నుంచి ఇద్దరికి అవకాశం రామచంద్రప్రసాద్‌ సింగ్‌, సంతోష్‌ కుష్వాహలకు మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.


Related News

papanasam-tamil-movie-kamal-hassan-pics-00189

దానికి కూడా సిద్ధమే అంటున్న కమల్ హాసన్

Spread the loveరాజకీయాల్లో అంటరానితనం ఉండకూడదని.. ప్రజా ప్రయోజనాలకోసం బిజెపితో కలిసి పని పనిచేయడానికైనా వెనుకాడబోనని కమల్ హసన్ స్పష్టంRead More

arun jaitly

జైట్లీ మండిపడ్డారు..

Spread the loveకేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ఓ వింత ప్ర‌శ్న ఇబ్బంది పెట్టింది. ఓ వ్య‌క్తిపై అరుణ్Read More

 • కమల్ కేజ్రీ కొత్త కూటమి
 • డేరాలో 600 అస్తిపంజరాలు
 • హీరోయిన్ మరణంపై మోడీకి లేఖ
 • డేరా వారసుడొచ్చాడు..!
 • అత‌డో కామ‌పిశాచి
 • మోడీ తీరుపై రాజన్ ఆగ్రహం
 • మోడీ క్యాబినెట్ లోకి 14మంది, ఏపీ నుంచి ఆయనే
 • క్యాబినెట్ లోకి కొత్త మొఖాలు, కొత్త పార్టీలు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *