బీజేపీ ఆశ‌ల‌కు గండి..!

bjp congress
Spread the love

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు క‌ద‌న‌రంగం సిద్ద‌మవుతోంది. కానీ క‌మ‌ల‌ద‌ళానికి రానురాను క‌ష్టాలు త‌ప్ప‌వ‌నిపిస్తోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో మ‌స‌క‌బారుతున్న బీజేపీ ప్ర‌భావానికి తోడుగా క‌ర్ణాట‌క కాంగ్రెస్ సార‌ధి, సీఎం సిద్ధి రామ‌య్య ఎత్తుల‌తో బీజేపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. ఇప్ప‌టికే కావేరీ జ‌లాల వివాదంలో బీజేపీ తీరు మీద రాష్ట్రంలో ఓ సెక్ష‌న్ తీవ్ర అసంతృప్తిగా ఉంది. దానికి తోడు తాజాగా లింగాయ‌త్ ల అంశం ముందుకొచ్చింది. లింగాయ‌త్ ల‌ను ప్ర‌త్యేక మ‌తారాధ‌కులుగా గుర్తిస్తూ క‌ర్ణాట‌కా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇది ఇప్పుడు బీజేపీకి క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. రాజ‌కీయంగా కీల‌క‌మ‌యిన లింగాయ‌త్ లు చాలాకాలంగా బీజేపీకి అండ‌గా ఉంటున్నారు. కానీ ఇప్పుడు సిద్ధ‌రామ‌య్య సంచ‌ల‌న నిర్ణ‌యంతో ఆ వ‌ర్గం సంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. సంబ‌రాలు జ‌రుపుకుంటోంది. దాంతో బీజేపీ ఆశ‌ల‌కు పెద్ద గండి ఖాయ‌మ‌నే అంచ‌నాలున్నాయి. అదే జ‌రిగితే బీజేపీకి బెంగ‌ళూరు ఆశ‌లు నెర‌వేరే అవ‌కాశం లేద‌ని అంచ‌నాలు పెంచ‌డానికి కార‌ణం అవుతున్నాయి.

ప్ర‌స్తుతం సౌత్ లో క‌మ‌లానికి చోటు లేకుండా పోతోంది. ఇప్ప‌టికే ఏపీలో మిత్ర‌ప‌క్షంతో స్నేహం చెడిన రీతిలో బంధం తెగిపోయింది. బీజేపీ ద‌క్షిణాది నుంచి ఖాళీ అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఏడాది క్రితం బీజేపీకి క‌ర్ణాట‌క మీద ఆశ‌లు క‌నిపించాయి. అయితే అవి రానురాను కొడ‌గొట్టుకుపోతున్నాయి. ముఖ్య‌మంత్రి తీసుకుంటున్న ఎత్తుల‌తో కాంగ్రెస్ కి కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. కుతూహ‌లం ప్ర‌ద‌ర్శిస్తోంది. దాంతో క‌మ‌లానికి ద‌క్షిణాది కోట మింగుడుప‌డద‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి.


Related News

atm-1495008331

ఏటీఎం క‌ష్టాల‌కి అస‌లు కార‌ణం అదేనా?

Spread the loveమ‌ళ్లీ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. 50 రోజులు ఆగండి..ఆ త‌ర్వాత ఉరితీసినా ఫ‌ర్వాలేద‌ని ధీమా వ్య‌క్తం చేసిన ప్ర‌ధానRead More

karnataka-elections-illustration-759

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌ర స‌ర్వే

Spread the loveక‌ర్ణాట‌క ఎన్నిక‌లు దేశ‌మంతా ఆస‌క్తిరేపుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వాసులు చాలామంది క‌ర్ణాట‌క ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్Read More

 • ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో మోడీ..!
 • క‌ర్ణాట‌క వైపు చూస్తున్న టీడీపీ
 • బీజేపీలో తిరుగుబాటు: మోడీ మీద గురి!
 • అడ్డంగా బుక్కయిన అమిత్ షా
 • సర్వే: మోడీకి మరో గండం
 • హోదా ఉద్య‌మాన్ని కొత్త‌మ‌లుపు తిప్పిన కాంగ్రెస్
 • బీజేపీ ఆశ‌ల‌కు గండి..!
 • అవిశ్వాసంతో మోడీకి ముప్పు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *